News July 5, 2024

పెద్దిరెడ్డి కుటుంబంపై విజిలెన్స్ డీజీకి ఎమ్మెల్సీ భూమిరెడ్డి ఫిర్యాదు

image

టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబంపై విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ డీజీకి ఫిర్యాదు చేశారు. మంగంపేట ముగ్గురాయి గనుల అక్రమాలపై విచారణ జరిపాలని కోరారు. గనుల్లో రూ.2 వేల కోట్ల దోపిడీ చేశారని తెలిపారు. ఎంప్రెడా కంపెనీ ముసుగులో పెద్దిరెడ్డి కుటుంబం దోపిడీకి పాల్పడిందని ఆరోపించారు. మాజీ ఎండీ వెంకట్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి అక్రమార్కులకు అండగా నిలిచారన్నారు.

Similar News

News March 4, 2026

చిత్తూరు: పదవుల కోసం పడిగాపులు..!

image

జిల్లాలో పదవుల కోసం TDP నేతల కళ్లు కాయలు కాచే పరిస్థితి నెలకొంది. CKబాబు, AS మనోహర్, దొరబాబు, గౌనివారి శ్రీనివాసులు తమకు కార్పొరేషన్లు, లేదా పార్టీ పదవులు కావాలని అధిష్ఠానాన్ని కోరుతున్నారు. పార్లమెంటరీ అధ్యక్ష పదవి ఆశించిన ఆశావహులకు రాష్ట్ర కమిటీలో స్థానం దక్కుతుందని భావిస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతున్నా తమకు పదవులు ఇవ్వలేదని సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట.

News March 3, 2026

చిత్తూరు: నిరుపయోగంగా నీటి తొట్టెలు

image

వేసవిలో పశువుల దాహార్తిని తీర్చేందుకు జిల్లా వ్యాప్తంగా నీటి తొట్టెలను ఉపాధి హామీ పథకంలో నిర్మించారు. జిల్లాలో రూ. 2.71 కోట్ల వ్యయంతో 776 నీటి తొట్టెలను నిర్మించారు. వీటి నిర్వహణను పట్టించుకోకపోవడంతో నిరుపయోగంగా మారుతున్నాయి. అధికారులు వీటిలో నీటిని నింపేలా చర్యలు చేపడితే.. వేసవిలో పశువులకు నీటి కొరత ఉండదని పాడి రైతులు తెలుపుతున్నారు.

News March 3, 2026

TPT: 30 ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

TTD ఆధ్వర్యంలోని బర్డ్ (BIRRD) హాస్పిటల్ నందు కాంట్రాక్ట్ ప్రాతిపదికగా వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు TTD ప్రకటనలో పేర్కొంది. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, మెడికల్ ఆఫీసర్ మొదలైన 9 విభాగాలలో మొత్తం 30 ఖాళీలు ఉన్నట్లు తెలియజేశారు. అర్హత, ఇతర వివరాలకు https://www.tirumala.org/ వెబ్ సైట్ చూడాలని సూచించారు. దరఖాస్తులకు చివరి తేదీ మార్చి 13.