News July 5, 2024
మాజీ మంత్రి మల్లారెడ్డికి హైకోర్టు షాక్

మాజీ మంత్రి మల్లారెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చింది. దూలపల్లిలోని మల్లారెడ్డి వర్సిటీ.. బాలానగర్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ కామర్స్ అండ్ డిజైన్ పేరుతో ఆఫ్ క్యాంపస్ ఏర్పాటు చేయడాన్ని సవాలు చేస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన హైకోర్టు.. వర్సిటీతో పాటు ఆఫ్ క్యాంపస్ కేంద్రంపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది.
Similar News
News March 12, 2026
ఇదే కొనసాగితే హైదరాబాద్‌లో బంద్!

నగరాన్ని గ్యాస్ కొరత కలవరపెడుతోంది. CNG స్టేషన్ల వద్ద బారులు తీరిన ఆటోలు, చర్లపల్లి గ్యాస్ ప్లాంట్ వద్ద నిలిచిన లారీలు, పలు రెస్టారెంట్లు, హోటళ్లలో ఖాళీ కుర్చీలు, స్టోర్‌లలో నిండుకుంటున్న ఇండక్షన్ స్టౌవ్‌లు, ప్రజల ముఖంలో దిగులు ఇవి HYDలో కనపడుతున్న దృశ్యాలు. గ్యాస్ సరఫరాలో ఇబ్బంది కొనసాగితే ‘HYD బంద్’ అయ్యి జనజీవనం స్తంభించడం, కడుపుమండటం, ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
News March 12, 2026
HYD: బస్తీ గర్భిణులకు ‘ఏఐ’ భరోసా

HHF-విప్రో సహకారంతో అర్బన్ స్లమ్స్‌లో ఆనందిమా కిట్ల ద్వారా ఉచిత వైద్య పరీక్షలు షురూ అయ్యాయి. ఈ స్మార్ట్ AI కిట్‌తో BP, షుగర్, హిమోగ్లోబిన్ పరీక్షలతో పాటు కడుపులోని బిడ్డ గుండె చప్పుడునూ నిమిషాల్లో తెలుసుకోవచ్చు. ఏవైనా తేడాలుంటే AI హెచ్చరిస్తుంది. ‘కేర్ మదర్’ యాప్ ద్వారా హైరిస్క్ కేసులను ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ తల్లీబిడ్డల ప్రాణాలకు రక్షణగా నిలుస్తున్నారు. గర్భిణుల పాలిట AI వరంగా నలిచింది.
News March 12, 2026
HYD: బస్తీ గర్భిణులకు ‘ఏఐ’ భరోసా

హెచ్‌హెచ్‌ఎఫ్-విప్రో సహకారంతో అర్బన్ స్లమ్స్‌లో ‘ఆనందిమా’ కిట్ల ద్వారా ఉచిత వైద్య పరీక్షలు షురూ అయ్యాయి. ఈ స్మార్ట్ ఏఐ కిట్‌తో బీపీ, షుగర్, హిమోగ్లోబిన్ వంటి పరీక్షలతో పాటు కడుపులోని బిడ్డ గుండె చప్పుడును కూడా నిమిషాల్లో తెలుసుకోవచ్చు. ఏవైనా తేడాలుంటే AI వెంటనే హెచ్చరిస్తుంది. ‘కేర్ మదర్’ యాప్ ద్వారా హైరిస్క్ కేసులను ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ తల్లీబిడ్డల ప్రాణాలకు రక్షణగా నిలుస్తున్నారు.


