News July 5, 2024

AUG 16 నుంచి ముంబైకి ఇండిగో సర్వీస్

image

AP: విజయవాడ ఎయిర్‌పోర్టు-ముంబైకి ఆగస్టు 16 నుంచి ఇండిగో సర్వీసులు నడపనుంది. రోజూ సా.6.30కు ముంబై నుంచి విమానం బయలుదేరి రా.8.20కి గన్నవరం చేరుకుంటుంది. రాత్రి 9 గంటలకు ఇక్కడ బయలుదేరి రా.11కు ముంబైలో ల్యాండ్ అవుతుంది. ఈ సర్వీస్ వల్ల ముంబైతోపాటు గల్ఫ్, UK, USA వెళ్లే ప్రయాణికులకు సులభమైన కనెక్టివిటీ ఉంటుందని ఇండిగో ప్రతినిధులు తెలిపారు. కాగా ఈ రూట్‌లో ఇప్పటికే ఎయిరిండియా సర్వీసులు నడుపుతోంది.

Similar News

News November 8, 2025

USలో 10 లక్షలకు పైగా ఉద్యోగాల్లో కోత

image

AI, ఆటోమేషన్, ఇన్‌ఫ్లేషన్, టారిఫ్‌లు.. వెరసి US జాబ్ మార్కెట్ సంక్షోభంలో పడింది. OCTలో 1,53,074 జాబ్స్‌కు కోత పడినట్లు ‘ఛాలెంజర్ గ్రే క్రిస్టమస్’ తెలిపింది. SEPతో పోలిస్తే 3 రెట్లు అధికమని పేర్కొంది. 2025లో ఇప్పటివరకు లేఆఫ్‌ల సంఖ్య 1.09Mకు చేరినట్లు వెల్లడించింది. కరోనా తర్వాత అత్యధిక లేఆఫ్‌లు ఇవేనని చెప్పింది. కాగా గత 2 ఏళ్లతో పోలిస్తే జాబ్ మార్కెట్ ఇప్పుడే స్లో అయినట్లు నిపుణులు పేర్కొన్నారు.

News November 8, 2025

AP న్యూస్ రౌండప్

image

☛ కళ్యాణదుర్గంలో భక్త కనకదాసు జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి లోకేశ్.. తమ జీవితాంతం అనంతపురం నేలకు రుణపడి ఉంటామని హామీ
☛ తిరువూరు వివాదం.. CBNకు TDP క్రమశిక్షణ కమిటీ నివేదిక
☛ వివేకా హత్య కేసులో దోషులను జగన్ వెనకేసుకొస్తున్నారు: ఆదినారాయణ రెడ్డి
☛ ప్రభుత్వంపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో సీదిరి అప్పలరాజుకు నోటీసులు.. కాశీబుగ్గ PSలో 3గంటలుగా ప్రశ్నిస్తున్న పోలీసులు

News November 8, 2025

ఇతిహాసాలు క్విజ్ – 60 సమాధానాలు

image

1. కృష్ణుడి మొదటి గురువు ‘సాందీపని’.
2. కృష్ణుడు పెరిగిన వనాన్ని ‘బృందావనం’ అని అంటారు.
3. నాగులకు తల్లి ‘కద్రువ’.
4. కుంభకర్ణుడి నిద్రకు కారణమైన దేవుడు ‘బ్రహ్మ’.
5. స్కందుడు అంటే ‘కుమారస్వామి’.
<<-se>>#Ithihasaluquiz<<>>