News July 5, 2024
బంటుమిల్లి: భర్తను హత్య చేసిన భార్య అరెస్ట్

బంటుమిల్లి మండలం చిన్నతుమ్మిడిలో మంగళవారం రాత్రి జరిగిన హత్య కేసుకు సంబంధించి హతుని భార్య కీర్తనను బందరు రూరల్ సీఐ నాగేంద్రప్రసాద్ అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. కీర్తన తన భర్త అప్పారావును స్క్రూ డ్రైవర్‌తో పొడిచి చంపిన విషయం తెలిసిందే. కాగా నిందితురాలు కీర్తనకు బంటుమిల్లి కోర్టు రిమాండ్ విధించినట్లు ఎస్సై వాసు తెలిపారు.
Similar News
News March 16, 2026
కృష్ణా: పాలక వర్గం లేకపోవడమే.. అక్కడ శాపం

చారిత్రక నేపథ్యం ఉన్న యనమలకుదురు రామలింగేశ్వర స్వామి ఆలయానికి పాలకవర్గం లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఒకే వ్యక్తి ఆధిపత్యం కోసం కమిటీ ఏర్పాటును అడ్డుకుంటున్నారని, దీనిపై ఎమ్మెల్యే కూడా మౌనం వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఆలయంలో రూ. 10 లక్షల మాయంపై కేసు నమోదైనా, పోలీసులకు ఆధారాలు ఇవ్వకుండా దర్యాప్తును పక్కదారి పట్టిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
News March 16, 2026
అమరజీవి త్యాగం తెలుగు జాతికి ఆదర్శం: అడిషనల్ ఎస్పీ

జిల్లా పోలీస్ కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ వి.వి. నాయుడు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన శ్రీరాములు గారు తెలుగు ప్రజలందరికీ ఆదర్శప్రాయుడని కొనియాడారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ వెంకటేశ్వరరావు, ఇన్స్పెక్టర్లు రవికిరణ్, రవి కుమార్ పాల్గొన్నారు.
News March 16, 2026
పారదర్శకంగా పదో తరగతి పరీక్షలు: డీఈవో

మచిలీపట్నంలోని పదో తరగతి పరీక్షా కేంద్రాలను డీఈవో యు.వి. సుబ్బారావు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. చిలకలపూడి సీపీఎం హైస్కూల్, నిర్మల, హైని, శ్రీ బాలాజీ, ఎంఈకే బాలాభాను తదితర పాఠశాలల్లో పరీక్షల సరళిని పరిశీలించారు. విద్యార్థులకు కల్పించిన వసతులను సమీక్షించిన ఆయన, ఎక్కడా అక్రమాలకు తావులేకుండా పరీక్షలను సజావుగా, పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.


