News July 5, 2024
అందుకే మంత్రి పదవి రాలేదేమో: బొబ్బిలి ఎమ్మెల్యే

మంత్రి పదవి రాకపోవడంతో బొబ్బిలి ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోమటిపల్లి జ్యోతిబాపులే బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థులకు విద్యా సామగ్రి కిట్లు గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ‘నేను డిగ్రీ కూడా పూర్తి చెయ్యలేదు.. అందుకనే మంత్రి పదవి రాలేదేమో’ అని ఆయన నవ్వుతూ వ్యాఖ్యానించారు. చదువు చాలా అవసరమని ప్రతి విద్యార్థి కష్టపడి చదువుకొని ఉన్నత స్థానాలను చేరుకోవాలని వారికి సూచించారు.
Similar News
News April 3, 2026
దొంగతనాలు పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి: VZM SP

వేసవి కాలంలో దొంగతనాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ దామోదర్ శుక్రవారం సూచించారు. ఇతర ప్రాంతాలకు వెళ్లే సమయంలో స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని, మున్సిపల్ ప్రాంతాల్లో నివసించే వారు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం (LHMS) సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. ఇళ్లకు బలమైన తాళాలు వేయడం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, రాత్రివేళల్లో లైట్లు వెలిగేలా చూడాలన్నారు.
News April 3, 2026
VZM: పారిశ్రామిక అభివృద్ధికి భూముల పరిశీలన

విజయనగరం జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేయడానికి చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర పారిశ్రామిక & వాణిజ్య శాఖ ప్రధాన కార్యదర్శి యువరాజ్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి, JC ఎస్.సేధు మాధవన్‌లతో కలిసి రామభద్రపురం మండలం కొట్టక్కి గ్రామంలోని ఏపీఐఐసీ భూములను పరిశీలించారు. అభివృద్ధికి అనుకూలంగా భూముల వినియోగంపై సమగ్రంగా పరిశీలించి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
News April 3, 2026
VZM: ఆ ఉద్యోగులకు నేటి నుంచి సెలవులు లేవు

వైద్యసేవ (ఆరోగ్యశ్రీ) పథకంలో పనిచేస్తున్న సిబ్బందికి నేటినుంచి సెలవులు లేవని ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ అధికారులు తెలియజేశారు. వైద్యసేవ ప్రైవేటు నెట్‌వర్క్ ఆసుపత్రులు సమ్మెలో పాల్గొనడం వల్ల జిల్లాలో వైద్యసేవ (ఆరోగ్యశ్రీ) సిబ్బందికి సెలవులు రద్దు చేస్తున్నట్టు జిల్లా సమన్వయ అధికారి సాయిరాం తెలిపారు. నెట్‌వర్క్ ఆసుపత్రులు సమ్మె విరమించే వరకు సిబ్బంది నిర్విరామంగా విధులు నిర్వహించాలని కోరారు.


