News July 5, 2024
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు 2024కు అర్హులైన ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు గుంటూరు జిల్లా విద్యా శాఖ అధికారి శైలజ గురువారం తెలిపారు. ఆమె మాట్లాడుతూ..http//nationalaward-stoteacher. education.gov.in వెబ్సైట్ ద్వారా నిర్దేశించిన మార్గదర్శకాలు అనునరిస్తూ.. జులై 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని డీఈఒ కోరారు.
Similar News
News November 30, 2024
2015లో ‘రిషితేశ్వరి’ రాసిన కన్నీటి లేఖ ఇదే.!
ANU విద్యార్థిని రిషితేశ్వరి చివరి క్షణాల్లో రాసిన లేఖ క్రూరమృగాలను సైతం కన్నీళ్లు పెట్టిస్తుంది. కనికరం లేకుండా కన్నీళ్లు పెట్టించిన సీనియర్లకు ఏం కుళ్లుపుట్టిందో ఏమో రిషితేశ్వరి చిరునవ్వును శాశ్వతంగా దూరం చేశారు. తండ్రితో పాటూ చదువంటే తనకెంతో ఇష్టమని, చదువు కోసం ANUకి వస్తే ప్రేమ పేరుతో సీనియర్లు వేధించారని అప్పట్లో రిషితేశ్వరి లేఖ రాసింది. కాగా ఈ కేసును కోర్టు కొట్టేయడంతో ఆమె లేఖ వైరలైంది.
News November 30, 2024
రిషితేశ్వరి ఆ రోజుల్లో ఎందుకు చనిపోయిందంటే.!
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ANU ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకొని 9 ఏళ్లు గడిచింది. సీనియర్స్ చరణ్ నాయక్, శ్రీనివాస్ రిషితేశ్వరిని ప్రేమిస్తున్నాని వెంటపడటంతో అనీషా నాగసాయి లక్ష్మీవారికి సహకరించింది. ఈ క్రమంలోనే 2015 మే 18న ఆ యువకులు ఇద్దరూ రిషితేశ్వరి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. అందుకోసమే తాను ఆత్మహత్య చేసుకుంటున్నాని 2015 జులై 14న రిషితేశ్వరి డైరీ రాసి చనిపోయింది.
News November 29, 2024
గుంటూరు: బోరుగడ్డ అనిల్‌కు 14 రోజుల రిమాండ్
బోరుగడ్డ అనిల్‌కు మరో 14 రోజులు రిమాండ్‌ను గుంటూరు జిల్లా కోర్టు పొడిగించింది. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర దూషణలపై కేసులో బోరుగడ్డ అనిల్‌కు ఉత్తర్వులు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఆయనను మళ్లీ రాజమండ్రి జైలుకు పట్టాభిపురం పోలీసులు తరలించారు. కాగా ఇప్పటికే అనిల్ పలు కేసుల్లో రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నారు.