News July 5, 2024

ఏపీలోని హైవేలకు రూ.4,774 కోట్లు

image

AP: 2024-25 వార్షిక ప్రణాళికలో భాగంగా రాష్ట్రంలోని 14 నేషనల్ హైవేలకు రూ.4,744 కోట్లు వెచ్చించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది.
☛ కడప-రాయచోటి ఘాట్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా 4 లేన్ల టన్నెల్ రోడ్డుకు రూ.1,000 కోట్లు
☛ ఆకివీడు-దిగమర్రు మధ్య 40KM మేర నాలుగు లేన్ల రోడ్డుకు రూ.1,200 కోట్లు
☛ అమలాపురం-రావులపాలెం మధ్య రోడ్డుకు రూ.630 కోట్లు
☛ నూజివీడు-లక్ష్మీపురం మధ్య 47KM రోడ్డుకు రూ.625 కోట్లు

Similar News

News October 6, 2024

విమానాలు తెలుపు రంగులోనే ఎందుకుంటాయి?

image

విమానాలు ఎక్కువగా తెలుపు రంగులోనే ఉంటాయి. దీనికో కారణం ఉంది. ‘వైట్ పెయింట్ సూర్యరశ్మిని గ్రహించదు. గాల్లో ఉన్నప్పుడు, నేలపై పార్క్ చేసి ఉంచినప్పుడు తెలుపు రంగు క్యాబిన్‌లో వేడిని తగ్గిస్తుంది’ అని నిపుణులు చెబుతున్నారు. డార్క్ పెయింట్‌తో పోల్చితే వైట్ తేలికైనది. డార్క్ కలర్ వేయడం వల్ల విమానం 8 మంది ప్రయాణికులంత బరువు ఎక్కువవుతుంది. తెలుపు రంగు వల్ల గాల్లో పక్షులు ఢీ కొట్టడం తగ్గుతుంది.

News October 6, 2024

మాది పొయ్యి వెలిగించే హిందూత్వ.. బీజేపీదేమో: శివసేన UBT

image

తమ హిందూత్వ ఇంట్లో పొయ్యి వెలిగిస్తే BJP హిందూత్వ ఏకంగా ఇంటికే నిప్పు పెడుతుందని శివసేన UBT నేత ఉద్ధవ్ ఠాక్రే విమర్శించారు. అందుకే శివసేనను ఫినిష్ చేయాలనుకున్నారని ఆరోపించారు. మరో నెలలోనే మహారాష్ట్రలో తమ కూటమి అధికారంలోకి వచ్చాక ద్రోహులకు ఉద్యోగాలు ఉండవన్నారు. ఏక్‌నాథ్ షిండే వర్గంలో చేరిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఇలా మాట్లాడారు. ప్రాజెక్టుల పేరుతో లూటీ చేసిన తీరును ప్రజల ముందు ఉంచుతామన్నారు.

News October 6, 2024

సికింద్రాబాద్ నుంచి గోవా ట్రైన్ ప్రారంభం.. షెడ్యూల్ ఇదే

image

సికింద్రాబాద్-వాస్కోడగామా-సికింద్రాబాద్ రైలు(17039)ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ రైలు ప్రతి బుధవారం, శుక్రవారం సికింద్రాబాద్ నుంచి.. ప్రతి గురువారం, శనివారం వాస్కోడగామా నుంచి బయల్దేరుతుంది. కాచిగూడ, షాద్ నగర్, జడ్చర్ల, MBNR, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుంతకల్, బళ్లారి, హోస్పేట్, కొప్పల్, హుబ్బలి, లోండా, కులేం, మడ్గాన్ తదితర స్టేషన్లలో ఆగుతుంది. పూర్తి షెడ్యూల్ పై ఫొటోలో చూడండి.