News July 5, 2024
కర్నూల్: ‘ఉపాధి’లో 78 మందికి షోకాజ్ నోటీసులు

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద లక్ష్యాలను సాధించడంలో అలసత్వం వహించిన 78 మంది ఉపాధి అధికారులు, సిబ్బందికి జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ అమరనాథరెడ్డి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఎమ్మిగనూరు, కర్నూలు, ఆదోని అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్లు, 10 మండలాల ఏపీవోలు, ఈసీలు, దాదాపు అన్ని మండలాల్లోని పలువురు సాంకేతిక సహాయకులకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి.
Similar News
News March 17, 2026
కర్నూలు జిల్లాలో 358 మంది విద్యార్థులు గైర్హాజరు

కర్నూలు జిల్లా వ్యాప్తంగా మంగళవారం జరిగిన ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలకు 358 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి లాలప్ప తెలిపారు. మొత్తం 18,104 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా, 17,746 మంది మాత్రమే హాజరయ్యారని వెల్లడించారు. జిల్లాలో పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని, ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని ఆయన స్పష్టం చేశారు.
News March 16, 2026
కర్నూలు జిల్లాలో మొదటి రోజే 1042 మంది విద్యార్థులు గైర్హాజరు

కర్నూలు జిల్లా వ్యాప్తంగా సోమవారం జరిగిన పదో తరగతి పరీక్షల్లో 1042 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఈవో సుధాకర్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 35851 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షకు హాజరు కావలసి ఉండగా.. 34809 మంది విద్యార్థులు హాజరయ్యారు. 702 మంది ప్రైవేట్ విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సిందిగా 650 మాత్రమే హాజరయ్యారు. 52 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆయన తెలిపారు.
News March 16, 2026
కర్నూలు జిల్లాలో గ్యాస్ కొరత లేదు: JC

కర్నూలు జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత లేదని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో సుమారు 11వేల సిలిండర్లు నిల్వలో ఉండగా, అదనంగా 7వేల సిలిండర్లు చేరుకున్నాయన్నారు. ప్రతిరోజు సగటున 10వేల సిలిండర్లు వినియోగదారులకు పంపిణీ జరుగుతోందన్నారు. గ్యాస్ కొరతపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. ఏజెన్సీలు ఇబ్బందులు కలిగిస్తే 1967 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలన్నారు.


