News July 5, 2024

అనంతపురం, సత్యసాయి జిల్లాలకు వర్ష సూచన

image

ఉమ్మడి అనంతపురం జిల్లాకు వర్ష సూచన ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గుజరాత్-కర్ణాటక తీరాల వెంబడి విస్తరించిన ద్రోణి కారణంగా నేడు అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఈ మేరకు ప్రజలు, రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

Similar News

News March 12, 2026

అనంతపురంలో YCP ఆవిర్భావ వేడుకలు

image

అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజా సంక్షేమమే పరమావధిగా పార్టీ అడుగులు వేస్తుందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి స్పష్టం చేశారు. అనంతపురంలోని జిల్లా కార్యాలయంలో గురువారం పార్టీ 16వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

News March 12, 2026

ప్రత్యేక అధికారులను నియమించనున్న జిల్లా కలెక్టర్

image

అనంతపురం జిల్లాలో గ్రామపంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించే అధికారాన్ని కలెక్టర్ ఆనంద్‌కు కట్టబెడుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సర్పంచుల పదవీకాలం ఏప్రిల్ 2 నాటికి ముగియనుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. స్థానిక డీపీఓలు రూపొందించిన జాబితా మేరకు కలెక్టర్ అధికారులకు పంచాయతీల బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం.

News March 12, 2026

అనంతపురం జిల్లాకు 24వ ర్యాంకు

image

అమరావతిలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు జిల్లాల వారీగా ర్యాంకులు ప్రకటించారు. సంక్షేమ పథకాలు, అధికారుల పనితీరుపై అనంతపురం జిల్లా రాష్ట్రస్థాయిలో 24వ స్థానంలో నిలిచింది. జిల్లాలో ప్రజల సంతృప్తి స్థాయి 64.6 నుంచి 66.6 శాతానికి పెరిగింది. పనితీరులో మరింత పురోగతి సాధించి మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్‌కు సీఎం ఆదేశాలు జారీ చేశారు.