News July 5, 2024
HYDలో ఇళ్ల అమ్మకాల జోరు

ఈ ఏడాది జనవరి-జూన్ మధ్య హైదరాబాద్‌లో 18,573 ఇళ్లు/ఫ్లాట్ల కొనుగోలు జరిగినట్లు నైట్ ఫ్రాంక్ నివేదిక వెల్లడించింది. గత ఏడాది ఇదే సమయంలో విక్రయాలతో పోలిస్తే 21 శాతం వృద్ధి నమోదైనట్లు తెలిపింది. ఆఫీస్ స్పేస్ డిమాండ్ 71 శాతం పెరిగి 50 లక్షల చదరపు అడుగులకు చేరినట్లు పేర్కొంది. ముంబైలో అత్యధికంగా 47,259 గృహాలు విక్రయం కాగా ఆ తర్వాత ఢిల్లీ-NCR(28,998), బెంగళూరు(27,404), పుణే(24,525) ఉన్నాయంది.
Similar News
News July 4, 2025
నటి రన్యా రావుకు చెందిన రూ.34 కోట్ల ఆస్తులు అటాచ్

గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టైన కన్నడ నటి రన్యా రావుకు సంబంధించిన రూ.34 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. రన్యా రావును బంగారం అక్రమ రవాణా, హవాలా నగదు బదిలీల కేసులో DRI అధికారులు ఈ ఏడాది మార్చి 5న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దుబాయ్‌లో బంగారం కొని భారత్‌కు తరలిస్తుండగా బెంగళూరులో అధికారులు పట్టుకున్నారు. అప్పటి నుంచి ఆమె జైలులోనే ఉన్నారు.
News July 4, 2025
సెప్టెంబర్‌లో స్కిల్ పోర్టల్ ప్రారంభం: మంత్రి లోకేశ్

AP: స్కిల్ పోర్టల్‌ను సెప్టెంబర్‌లో ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి లోకేశ్ ఆదేశించారు. నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారులతో ఉండవల్లి నివాసంలో సమీక్ష నిర్వహించారు. ‘ఉద్యోగ, ఉపాధి కల్పనకు మిషన్ మోడ్ విధానంలో స్కిల్ పోర్టల్‌ను ప్రజల్లోకి తీసుకెళ్తాం. 90 రోజులపాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాక ఆటోమేటిక్‌గా రెజ్యూమ్ రెడీ అవుతుంది’ అని Xలో పోస్ట్ చేశారు.
News July 4, 2025
కాసేపట్లో మోస్తరు నుంచి భారీ వర్షం: వాతావరణ కేంద్రం

TG: కాసేపట్లో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. హైదరాబాద్ నగరంలో రాత్రి 9 గంటల తర్వాత అరగంట పాటు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఆదిలాబాద్, గద్వాల, ఆసిఫాబాద్, MBNR, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, నిర్మల్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో తేలికపాటి వర్షం వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.