News July 5, 2024
డిసెంబర్‌లో గ్రూప్-2 నిర్వహించాలి: నిరుద్యోగులు

TG: గ్రూప్-2, 3 పోస్టుల సంఖ్యను పెంచి, డిసెంబర్‌లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని నిరుద్యోగులు కోరుతున్నారు. DSC, గ్రూప్-2కి కేవలం ఒక్క రోజు గ్యాప్ మాత్రమే ఉందని గుర్తుచేస్తున్నారు. గ్రూప్-2, 3కి ఒకే సిలబస్ ఉన్నందున డిసెంబర్‌లో నిర్వహిస్తే నిరుద్యోగులు ఒత్తిడి లేకుండా సజావుగా ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంటుందన్నారు. ఈ విషయంలో సీఎం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Similar News
News November 8, 2025
న్యూస్ అప్‌డేట్స్ 10@AM

* తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక నిందితుడిగా ఉన్న A-16 అజయ్ కుమార్ సుగంధ్ అరెస్టు. భోలేబాబా కంపెనీకి కెమికల్స్ ఉన్న పామాయిల్ సప్లై చేసినట్లు గుర్తింపు
*తిరుపతి జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటన. పలమనేరులో కుంకీ ఏనుగుల క్యాంపును సందర్శించనున్న పవన్
*బిహార్ తొలి దశ పోలింగ్‌లో 65.08% ఓటింగ్ నమోదు: ఈసీ
*ఢిల్లీలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాని విమాన సర్వీసులు
News November 8, 2025
PDILలో 87 ఇంజినీర్ ఉద్యోగాలు

నోయిడాలోని ప్రాజెక్ట్స్ అండ్ డెవలప్‌మెంట్ ఇండియా లిమిటెడ్(<
News November 8, 2025
తెలంగాణలో యాసంగి సాగుకు అనువైన వేరుశనగ రకాలు

TG: యాసంగి నీటి వసతి కింద రాష్ట్రంలో సాగుకు అనువైన వేరుశనగ రకాలు కదిరి-6, కదిరి-7, కదిరి-8, కదిరి-9, కదిరి హరితాంధ్ర (కె-1319), కదిరి లేపాక్షి (కె-1812), ధరణి (T.C.G.S-1043), నిత్యహరిత (T.C.G.S-1157), విశిష్ట (T.C.G.S-1694), జగిత్యాల పల్లి (జె.సి.జి. 2141), టి.ఏ.జి-24, అభయ, ఇ.సి.జి.వి-9114, జగిత్యాల-88 (జె.సి.జి-88), గిర్నార్-4 (జి.సి.జి.వి-15083), గిర్నార్-5(ఐ.సి.జి.వి-15090) మొదలైనవి.


