News July 5, 2024
ట్రాఫిక్ సమస్యల పరిష్కార సేవల్లో వాలంటీర్లు

TG: ట్రాఫిక్ సమస్యల పరిష్కారంలో కాలేజీ విద్యార్థులను వాలంటీర్లుగా రవాణా శాఖ వినియోగించుకోనుంది. ఆగస్టు నుంచి ప్రతి నెలా ఒక గంట తమ కాలేజీల సమీపంలో పోలీసులకు సహకారంగా వీరు విధులు నిర్వహిస్తారు. తొలుత HYDలో, ఆ తర్వాత రాష్ట్రంలో అమలు చేస్తారు. 300 మంది NSS విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్, రోడ్డు భద్రతపై శిక్షణ ఇచ్చారు. వీరు ఒక్కొక్కరు 100 మందికి శిక్షణ ఇచ్చి, మొత్తంగా 3 లక్షల మందిని సిద్ధం చేస్తున్నారు.
Similar News
News December 30, 2025
నేడు ఉత్తర ద్వార దర్శనం చేసుకోలేకపోతే?

నేడు ఉత్తర ద్వార దర్శనం చేసుకోలేని వారికి ఇతర పరిహారాలెన్నో ఉన్నాయి. పండితుల సూచన ప్రకారం.. విష్ణుమూర్తి పటం ముందు దీపం వెలిగించి, ఆయనను మనస్ఫూర్తిగా పూజిస్తే వైకుంఠ ద్వార దర్శన భాగ్యం దక్కినట్లేనట. అలాగే ‘వైకుంఠ ఏకాదశి వ్రతం’ ఆచరించాలని సూచిస్తున్నారు. ఉపవాసం, జాగరణ, విష్ణు సహస్రనామ పారాయణలతో ఉత్తర ద్వార దర్శనంతో సమానమైన ఫలితం దక్కుతుందని, వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
News December 30, 2025
ఇక నుంచి స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామ సచివాలయాలు

AP: గ్రామ, వార్డు సచివాలయాల పేరును ప్రభుత్వం అధికారికంగా మార్చింది. ఇక నుంచి ‘స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామ సచివాలయాలు’గా మారుస్తూ ఆర్డినెన్స్ జారీకి నిన్న క్యాబినెట్ ఆమోదం తెలిపింది. స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో గ్రామ, వార్డు సచివాలయాలు కీలకపాత్ర పోషించనున్నాయని మంత్రులు పేర్కొన్నారు. జిల్లా GSWS కార్యాలయాల పేరు కూడా మారుస్తామని వెల్లడించారు.
News December 30, 2025
టోకెన్లు లేని భక్తులు జనవరి 2 నుంచి రావాలి: టీటీడీ ఈవో

AP: వైకుంఠ ద్వారదర్శనాలు ప్రణాళిక ప్రకారం జరుగుతున్నాయని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఈ మూడు రోజులు ఆన్‌లైన లక్కీ డిప్ ద్వారా టోకెన్లు పొందిన భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతి ఇస్తామని చెప్పారు. టోకెన్లు లేని భక్తులు జనవరి 2న నేరుగా రావాలని విజ్ఞప్తి చేశారు. వారికి జనవరి 8 వరకు దర్శనాలకు అనుమతి ఇస్తామని పేర్కొన్నారు.


