News July 5, 2024
అనుదీప్ డైరెక్షన్లో విశ్వక్ సేన్ సినిమా?

‘జాతిరత్నాలు’ డైరెక్టర్ అనుదీప్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ ఓ సినిమా చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. అనుదీప్ చెప్పిన కథకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ మూవీని నిర్మించనున్నట్లు సినీవర్గాలు పేర్కొంటున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. విశ్వక్ ప్రస్తుతం లైలాతో పాటు మరికొన్ని సినిమాలతో బిజీగా ఉన్నారు.
Similar News
News September 19, 2025
బగ్రామ్ ఎయిర్‌బేస్ స్వాధీనం చేసుకోవాలి: ట్రంప్

అఫ్గానిస్థాన్‌లోని బగ్రామ్ ఎయిర్‌బేస్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. గత ప్రెసిడెంట్ జోబైడెన్ ఎలాంటి ప్రయోజనం లేకుండానే ఆ స్థావరాన్ని వదిలేశారని విమర్శించారు. చైనా అణ్వాయుధ ఉత్పత్తి కేంద్రాల నుంచి కేవలం గంటలోనే ఈ ఎయిర్‌బేస్‌కు చేరుకోవచ్చని తెలిపారు. భవిష్యత్తులో చైనా ఈ స్థావరాన్ని చేజిక్కించుకుంటుందన్న అనుమానంతోనే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
News September 19, 2025
ఈ అసెంబ్లీ సమావేశాలకూ వైసీపీ దూరం?

AP: YCP MLAలు అసెంబ్లీకి రావాలని స్పీకర్ అయ్యన్న పదేపదే కోరినా.. ఇవాళ YCP సభ్యులెవరూ సమావేశాలకు రాలేదు. ఇదే సమయంలో ఆ పార్టీ LP సమావేశంలో జగన్ మాట్లాడుతూ.. మండలి సభ్యులే బలంగా పోరాడాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీకి వెళ్లకూడదని నిర్ణయించుకునే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తమకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తామని జగన్ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు.
News September 19, 2025
మోదీతో మంచి స్నేహం ఉంది: ట్రంప్

భారత్, PM మోదీతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని US అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. మోదీతో మంచి స్నేహం ఉందని, ఆ కారణంగానే ఆయనకు నిన్న బర్త్ డే విషెస్ తెలిపానన్నారు. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్తో ద్వైపాక్షిక భేటీ అనంతరం ఆయన మాట్లాడారు. చమురు కొనుగోళ్లు ఆపేస్తేనే రష్యా దిగి వస్తుందని చెప్పారు. చైనా ఇప్పటికే అమెరికాకు భారీ టారిఫ్‌లు చెల్లిస్తోందని, మరిన్ని విధించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.