News July 5, 2024

నామినేటెడ్ పోస్టుల కేటాయింపుపై టీడీపీ కసరత్తు

image

AP: పార్టీ విజయం కోసం కష్టపడిన వారికి నామినేటెడ్ పదవుల కేటాయింపుపై TDP కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ ఒత్తిళ్లను తట్టుకుని ఏ సెగ్మెంట్‌లో ఎవరు ఎలా పనిచేశారు? దాడులకు గురైన వారెవరు? అనే వివరాలను సేకరించాలని నిర్ణయించింది. మరోవైపు ప్రభుత్వ ఆదేశాల మేరకు వివిధ శాఖలు, కార్పొరేషన్లలో ఉన్న నామినేటెడ్ పోస్టుల వివరాలను ఈ నెల 8లోపు పంపాలని GAD ఆదేశించింది. అలాగే సొసైటీల్లోని ఖాళీల వివరాలనూ పంపాలని సూచించింది.

Similar News

News March 18, 2026

‘ధురంధర్-2’ పబ్లిక్ టాక్

image

‘ధురంధర్-2’ ప్రీమియర్ షోలు చూసిన ప్రేక్షకులు Xలో రివ్యూలు ఇస్తున్నారు. ఫిల్మ్ మేకింగ్ అదిరిపోయిందని, రణ్‌వీర్ సింగ్ నటన, ఇంటర్వెల్ అద్భుతం అని ప్రశంసిస్తున్నారు. డైరెక్టర్ ఆదిత్య ధార్ 4 గంటల సినిమాను ఎక్కడా బోర్ కొట్టకుండా తెరకెక్కించారని చెబుతున్నారు. హింసాత్మక సీన్లు ఎక్కువగా ఉన్నా దేశభక్తి సినిమా కాబట్టి జస్టిఫై చేసేలా ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు.
*Way2News ఫుల్ రివ్యూ రేపు ఉదయం..

News March 18, 2026

మహిళా ఓటర్ల ఫేవర్ ఎవరికో? (1/2)

image

నాలుగు రాష్ట్రాలు, ఓ యూటీ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమైన వేళ మరోసారి మహిళా ఓటర్ల డామినేషన్ చర్చనీయాంశమైంది. 2025 బిహార్, ఢిల్లీ ఎన్నికల్లో ఉమెన్ ఫ్యాక్టర్ వర్కౌట్ అయింది. ఈ నేపథ్యంలో ఈసారి కూడా మహిళలను ఆకట్టుకునేందుకు పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి. అస్సాంలో 1.25Cr (49.97%), బెంగాల్‌లో 3.16Cr (49%), TNలో 2.89Cr (51.07%), కేరళంలో 1.38Cr (51%), పుదుచ్చేరి 5.3లక్షలు (53%) మహిళా ఓటర్లు ఉన్నారు.

News March 18, 2026

మహిళా ఓటర్ల ఫేవర్ ఎవరికో? (2/2)

image

మహిళలు డిసైడింగ్ ఫ్యాక్టర్‌గా ఉన్నారు కాబట్టే WBలో మమతా సర్కార్‌‌ ఇచ్చిన లక్ష్మిర్ భండార్ స్కీమ్‌కు కౌంటర్‌గా ₹5700Cr ప్యాకేజ్, అన్నపూర్ణ యోజనతో నెలకు ₹3వేలు ఇస్తామని BJP ప్రకటించింది. TNలో నెలకు ₹2500, ఆడశిశువులకు గోల్డ్ రింగ్ వంటి హామీలొచ్చాయి. కేరళంలో పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. అస్సాంలో మహిళా సంఘాలే తమ డిమాండ్స్‌పై మ్యానిఫెస్టో ప్రకటించాయి. మరి మహిళలు గేమ్ ఛేంజర్‌గా మారతారో చూడాలి.