News July 5, 2024

కల్వరాల్ శివారులో ఎలుగుబంటి సంచారం

image

సదాశివనగర్ మండలంలోని కల్వరాల్ శివారులో ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు స్థానిక రైతులు గురువారం తెలిపారు. దీంతో ప్రధానంగా రైతులు భయబ్రాంతులకు గురయ్యారు. ప్రస్తుతం వ్యవసాయ పంటలు వేసే సమయంలో ఎలుగుబంటి రావడంతో రైతులు భయాందోళన చెందుతున్నారు. అటవీ శాఖ అధికారులు ఎలుగుబంటిని పట్టుకుని ఇతర ప్రాంతానికి తరలించాలని రైతులు కోరుతున్నారు.

Similar News

News March 18, 2026

వైద్య సేవల్లో అలసత్వం వద్దు: డీఎంహెచ్‌ఓ

image

జిల్లాలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలులో వైద్య సిబ్బంది ఎక్కడా అలసత్వం ప్రదర్శించవద్దని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.బి.రాజశ్రీ స్పష్టం చేశారు. బుధవారం జిల్లాలోని ఉప వైద్యాధికారులు, ప్రోగ్రాం అధికారులు, పర్యవేక్షణ అధికారులు, ఆర్బీఎస్‌కే వైద్యులతో ఆమె ‘జూమ్‌’ ద్వారా సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో వైద్య సేవలను మెరుగుపరచాలని, నిర్దేశించిన లక్ష్యాలను సకాలం పూర్తి చేయాలని ఆదేశించారు.

News March 18, 2026

నిజామాబాద్ జిల్లాలో ఆయిల్ పామ్ పరిశ్రమకు ఏర్పాటు సన్నాహాలు

image

జిల్లాలో ఆయిల్ పామ్ పరిశ్రమ ఏర్పాటు కోసం ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డితో పాటు కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి బుధవారం నిజామాబాద్ పట్టణంలో అనువైన స్థలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లాకు ఆయిల్ పరిశ్రమ మంజూరు చేసేందుకు CM రేవంత్ రెడ్డి సంసిద్ధత వ్యక్తం చేశారని అన్నారు. అనువైన స్థలాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నట్లు సుదర్శన్ రెడ్డి వెల్లడించారు.

News March 17, 2026

NZB: హనుమాన్ జయంతి వేడుకల అనుమతి ఇవ్వాలి: VHP

image

ఏప్రిల్ 2న జిల్లాలోని NZB, బోధన్, ఆర్మూర్‌లలో నిర్వహించే హనుమాన్ జయంతి వేడుకలకు అనుమతి ఇవ్వాలని విశ్వ హిందూ పరిషత్ (VHP) నాయకులు కోరారు. NZB CP సాయి చైతన్యను మంగళవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో VHP విభాగ్ కార్యదర్శి తమ్మల కృష్ణ, జిల్లా కార్యదర్శి గాజుల దయానంద్, ప్రాంత గోరక్ష కృషి సంపర్క ప్రముఖ్ దాత్రిక రమేశ్, హిందూవాహిని జిల్లా సంయోజక్ దాసరి సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.