News July 5, 2024

7, 8 తేదీల్లో భారీ వర్షాలు

image

TG: ఈ నెల 7, 8 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీగా వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్‌ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో 7న, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో 8న వర్షపాతం ఉంటుందని పేర్కొంది. మిగిలిన జిల్లాల్లోనూ చెదురుమదురుగా వర్షాలు పడొచ్చని అంచనా వేసింది.

Similar News

News February 23, 2026

₹130 కోట్ల భారీ రివార్డు ఉన్న క్రిమినల్ హతం!

image

ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్‌లో ఒకడు, మెక్సికోలోని అత్యంత శక్తిమంతమైన ‘జాలిస్కో న్యూ జనరేషన్’ (CJNG) డ్రగ్ కార్టెల్ బాస్ ‘ఎల్ మెంచో’ ఆర్మీ ఆపరేషన్‌లో హతమయ్యాడు. ఆదివారం తెల్లవారుజామున జాలిస్కో రాష్ట్రంలోని తపాల్పాలో జరిగిన మెరుపు దాడిలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. మెక్సికో సిటీకి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. అతనిపై US ప్రభుత్వం గతంలో సుమారు ₹130 కోట్ల రివార్డును ప్రకటించింది.

News February 23, 2026

ఆ మోజే టీమ్ఇండియా కొంపముంచిందా?

image

SAతో మ్యాచ్‌లో భారత బ్యాటర్ల తీరు చూస్తే ఒక సమస్య కనిపించింది. అదే ‘డాట్ బాల్స్’. క్రీజులో పాతుకుపోయి స్ట్రైక్ రొటేట్ చేయడం కంటే ప్రతి బాల్‌ను బౌండరీకి పంపాలనే ఆరాటమే భారత్‌ను దెబ్బతీసినట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. సింగిల్స్ తీస్తూ ప్రెజర్ తగ్గించుకోవాల్సింది పోయి వరుసగా డాట్ బాల్స్ ఆడటంతో ఒత్తిడి పెరిగి వికెట్లు పారేసుకున్నారు. కేవలం బౌండరీలపైనే ఆధారపడటం వల్ల మధ్యలో ఇన్నింగ్స్ మందగించింది.

News February 23, 2026

పాక్ వైమానిక దాడులపై భారత్ ఫైర్

image

అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. మహిళలు, పిల్లలు ప్రాణాలు కోల్పోవడం దారుణమని విదేశీ వ్యవహారాల శాఖ మండిపడింది. తన దేశంలోని అంతర్గత వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే పాక్ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని పేర్కొంది. అఫ్గానిస్థాన్ సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రతకు భారత్ ఎప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేసింది.