News July 5, 2024
శ్రీకాకుళం: గడ్డి మందు తాగి మహిళ మృతి

పాలకొండకు చెందిన వివాహిత మాధవి(42) గురువారం విషం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. గారమ్మ కాలనీలో నివాసం ఉంటున్న ఆమె గత రాత్రి గడ్డి మందు తాగింది. గమనించిన కుటుంబీకులు ఆమెను శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News March 21, 2026
శ్రీకాకుళం: ప్రత్యేక అధికారుల నియామకానికి కసరత్తు…!

శ్రీకాకుళం జిల్లాలో 30 మండలాల్లో 912 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఏప్రిల్ 2వ తేదీతో పంచాయతీల పాలకవర్గం గడువు ముగియనుంది. సమయం దగ్గర పడుతుండటంతో ప్రత్యేక అధికారులు జాబితాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. మండలం యూనిట్ గా క్లస్టర్లు విభజించి గెజిటెడ్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించే ఏర్పాట్లు చేస్తున్నారు. పాలకవర్గం లేకుండా పంచాయతీల ప్రగతి కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నారు.
News March 21, 2026
ఎచ్చెర్ల: పరీక్షలు రాస్తారు.. ఫలితాలు మాత్రం ఎప్పటికో..!

అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో పరీక్షల ఫలితాలు విడుదలలో తీవ్ర జాప్యంపై విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెమిస్టర్ పరీక్షలు నిర్వహణ తర్వాత కనీసం 30 నుంచి 45రోజుల వరకు ఫలితాలు వెల్లడికి పడుతోందని విద్యార్థులు వాపోతున్నారు. రీ వాల్యుయేషన్ ఫలితాలు రావడంలో, సర్టిఫికెట్స్ అందజేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని, దీంతో ఆందోళన చెందుతున్నామని అంటున్నారు.
News March 21, 2026
మందస : బైక్ యాక్సిడెంట్.. వ్యక్తి మృతి..!

మందస మండలం కొర్రాయిగేటు బ్రిడ్జి వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వజ్రపుకొత్తూరు(M) పూండిగోవిందపురానికి చెందిన లావేటి మనోజ్ (21) చికిత్స పొందుతూ మృతి చెందాడు. కార్పెంటర్ పనిచేసే మనోజ్ పని ముగించుకుని ఇంటికి వచ్చే తరుణంలో బైకు అదుపుతప్పి పడిపోవడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న మృతి చెందినట్లు మందస ఎస్ఐ కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు.


