News July 5, 2024
HYD: 8వ అంతస్తు నుంచి దూకి మహిళ ఆత్మహత్య

MBBS పూర్తి చేసిన మహిళ మతిస్థిమితం కోల్పోయి అపార్ట్‌మెంట్ 8వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నాగోల్ PS పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ASరావు నగర్‌కు చెందిన నిహారిక రావు(29)కు రెండేళ్ల క్రితం వివాహమైంది. అయితే గత కొంతకాలంగా మానసిక ఆరోగ్య పరిస్థితి సరిగ్గా ఉండటం లేదు. దీంతో రాజీవ్ స్వగృహ అపార్ట్‌మెంట్ 8వ అంతస్తు నుంచి దూకడంతో కారుపై పడి మృతి చెందింది. కేసు నమోదైంది.
Similar News
News March 3, 2026
‘బ్లాక్‌చైన్ బస్తీ’గా పాతబస్తీ?

చార్మినార్ పరిసరాల్లోని యువత ఇప్పుడు బిర్యానీ కబుర్ల కంటే ‘బ్లాక్‌చైన్’ టెక్నాలజీ గురించే మాట్లాడుకుంటున్నారు. చిన్న ఇంటర్నెట్ సెంటర్లలో డిజిటల్ లెడ్జర్స్, క్రిప్టో కోడింగ్‌పై వర్క్‌షాపులు జోరుగా సాగుతున్నాయి. విదేశీ ప్రాజెక్టుల కోసం ఇక్కడి కుర్రాళ్లు ఫ్రీలాన్సింగ్ చేస్తూ భారీగా సంపాదిస్తూ పాతబస్తీ యువత డిజిటల్ విప్లవాన్ని సృష్టిస్తోంది. ఇది భవిష్యత్తులో HYDకు కొత్త గుర్తింపు తీసుకురావడం ఖాయం.
News March 3, 2026
GHMC: ప్రభుత్వ భవనాలే రూ.వెయ్యి కోట్ల బాకీ?

GHMC విభజన తర్వాత ఖజానా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. సుమారు ₹3,000 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలు పేరుకుపోవడంతో అధికారులు చర్యలకు దిగారు. బకాయిదారులకు రెడ్ నోటీసులు జారీ అయ్యాయి. గడువులోగా చెల్లించకుంటే ఆస్తులను జప్తు చేయొచ్చు. విడ్డూరమేంటంటే.. ప్రభుత్వ భవనాలే దాదాపు ₹1,000 కోట్లు బకాయి ఉన్నాయి. సామాన్యుడిపై కొరడా ఝుళిపించే యంత్రాంగం ప్రభుత్వ సంస్థల బకాయిలను ఎలా వసూలు చేస్తుందో చూడాలి.
News March 3, 2026
మంత్రి ఆకస్మిక తనిఖీ.. బల్కంపేట ఆలయ ఈవో సస్పెండ్

బల్కంపేట ఎల్లమ్మ ఆలయ ఇన్‌ఛార్జీ ఈఓ తమ్మినేని శేఖర్‌ను సస్పెండ్ చేస్తూ దేవదాయ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ఆ శాఖ మంత్రి కొండా సురేఖ ఆలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి నిర్వహణపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు నెలల్లో అన్ని మారాలని అధికారులకు హెచ్చరించారు. నిర్వహణలో బాధ్యత రహితంగా వహించిన వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించగా అధికారులు సస్పెండ్ చేశారు.


