News July 5, 2024

రేపు కడపకు రానున్న YS జగన్

image

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు కడప జిల్లా పర్యటనకు రానున్నారు. అనంతరం 8వ తేదీన తన తండ్రి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకొని ఇడుపులపాయలోని ఆయన సమాధి వద్ద నివాళులర్పించేందుకు ఆయన రేపు సాయంత్రం కడప రానున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి విమానం ద్వారా కడపకు చేరుకొని రోడ్డు మార్గాన ఇడుపులపాయ వెళ్తారని కడప మేయర్, జిల్లా వైసీపీ అధ్యక్షుడు సురేశ్ బాబు తెలిపారు.

Similar News

News March 4, 2026

కడప: ప్రత్యేక విభాగాల అధికారులతో జిల్లా ఎస్పీ సమీక్ష

image

ప్రత్యేక పోలీస్ విభాగాల అధికారులతో ఎస్పీ విశ్వనాథ్ బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఫ్యాక్షన్ జోన్, DCRB, DTRB, SBI, SCST సెల్, సైబర్ క్రైమ్, ట్రాఫిక్, కోర్ట్ మానిటరింగ్ సెల్ తదితర విభాగాల అధికారులతో సమీక్షించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఫ్యాక్షన్ ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. నేర చరిత్ర కలిగిన వారిపై నిఘా ఉంచాలని ఆయన ఆదేశించారు.

News March 4, 2026

కడప: ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో శనగ ప్రొక్యూర్‌మెంట్ కేంద్రాలు.?

image

కడప జిల్లాలో శనగ పంట ప్రొక్యూర్‌మెంట్ బాధ్యత మార్క్ ఫెడ్ తీసుకుంది. జిల్లాలో 21 ప్రాంతాల్లో కేంద్రాలను ఏర్పాటు చేసింది. మార్క్ ఫెడ్ వద్ద ఉద్యోగులు లేక, డీసీఎంఎస్‌ను ఏజెన్సీగా నియమించుకుంది. డీసీఎంఎస్ వద్ద కూడా సిబ్బంది లేక, 21 ప్రొక్యూర్‌మెంట్ కేంద్రాల్లో నలుగురు DCMS ఉద్యోగులను సూపర్వైజర్లుగా పెట్టారు. 21మంది ప్రవేట్ వారిని ఇన్‌ఛార్జ్‌లుగా పెట్టారు. వీరు అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి.

News March 4, 2026

వాట్సాప్ ఇంటిగ్రేషన్ ద్వారా వైవీయూ ఫలితాలు

image

వాట్సాప్ ఇంటిగ్రేషన్ ద్వారా YVU నిర్వహించే అన్ని పరీక్షల ఫలితాలు తెలుసుకోవచ్చని వర్సిటీ ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ వెల్లడించారు. వాటికి సంబంధించిన పోస్టర్లను కులసచివులు పద్మ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొ.కె.ఎస్.వి కృష్ణారావుతో కలిసి ఆవిష్కరించారు. వి.సి మాట్లాడుతూ.. ప్రభుత్వం వాట్సాప్(9552300009) ఇంటిగ్రేటెడ్ సేవల ద్వారా ఫలితాలు వెంటనే సెల్‌లో పొందవచ్చన్నారు.