News July 5, 2024

ముంబై పోలీసులకు థాంక్స్: కోహ్లీ

image

ముంబైలో టీమ్ ఇండియా విజయోత్సవ యాత్రకు అభిమానులు అసంఖ్యాకంగా వచ్చారు. ఆ పరిస్థితిని ముంబై పోలీసులు సమర్థంగా ఎదుర్కొని శాంతిభద్రతలకు భంగం కలగకుండా చూశారు. ఈ నేపథ్యంలో వారికి భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కృతజ్ఞతలు తెలిపారు. ‘టీం ఇండియా విక్టరీ పరేడ్‌లో తిరుగులేని సమర్థత చూపించిన ముంబై పోలీసులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ నిబద్ధత, సేవ అద్భుతం. జైహింద్’ అని ట్వీట్ చేశారు.

Similar News

News October 6, 2024

ప్రకాశ్ రాజ్‌కు నిర్మాత కౌంటర్

image

TN డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌తో కూర్చున్న ఫొటో షేర్ చేసిన ప్రకాశ్ రాజ్‌కు తమిళ నిర్మాత వినోద్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. ‘మీతో ఉన్న ముగ్గురు ఎన్నికల్లో గెలిస్తే, మీరు డిపాజిట్ కూడా దక్కించుకోలేదు. అది మీ మధ్య తేడా. ఎలాంటి కారణం చెప్పకుండా మీరు షూటింగ్ నుంచి వెళ్లడంతో నాకు రూ.కోటి నష్టం వచ్చింది. కాల్ చేస్తానని ఇంతవరకు చేయలేదు’ అని ట్వీట్ చేశారు. ఈయన ప్రకాశ్ రాజ్‌తో ‘ఎనిమీ’ మూవీ తీశారు.

News October 6, 2024

US నేషనల్ క్రికెట్ ఓనర్‌షిప్‌లోకి సచిన్

image

క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అమెరికా నేషనల్ క్రికెట్ లీగ్ (NCL) ఓనర్‌షిప్ గ్రూపులో చేరారు. 60 Strikes ఫార్మాట్లో జరిగే ఈ లీగులో విజేతకు ట్రోఫీ అందజేస్తారు. ‘నా లైఫ్‌లో అత్యుత్తమ జర్నీ క్రికెట్. US NCLలో చేరడం హ్యాపీగా ఉంది. కొత్త జనరేషన్లో ఈ టోర్నీ స్ఫూర్తి నింపుతుంది. అమెరికాలో క్రికెట్ వృద్ధిని గమనిస్తున్నా’ అని ఆయన ట్వీట్ చేశారు. సన్నీ, వెంగీ, రైనా, డీకే, ఉతప్ప ఇందులో భాగమవుతున్నారు.

News October 6, 2024

ఇంటర్ పరీక్షలపై కీలక నిర్ణయం!

image

AP: వచ్చే విద్యాసంవత్సరం నుంచి <<14238313>>ఇంటర్‌<<>> సిలబస్‌, పరీక్షల విధానాన్ని మార్చడంపై విద్యామండలి కసరత్తు చేస్తోంది. అన్ని సబ్జెక్టుల్లో ఒక మార్కు ప్రశ్నలు 20 ఇవ్వడంతోపాటు 2, 4, 8 మార్కుల విధానాన్ని తీసుకురానుంది. ప్రతి ప్రశ్నకు మరో ప్రశ్న ఛాయిస్‌గా ఉంటుంది. ఆర్ట్స్ గ్రూప్స్‌లో హిస్టరీ మినహా దాదాపు అన్ని సబ్జెక్టులకూ NCERT సిలబస్‌నే అమలుచేయనుంది. మ్యాథ్స్, కెమిస్ట్రీ సిలబస్‌ను కుదించనుంది.