News July 5, 2024
టికెట్ల ధరలపై అపోహలు.. కల్కి నిర్మాత కీలక ప్రకటన

సినిమా టికెట్ రేట్ల విషయంలో తన <<13561949>>వ్యాఖ్యలతో<<>> అపోహలు వస్తున్నాయని నిర్మాత సి.అశ్వనీదత్ తెలిపారు. ‘సినిమా టికెట్ల రేట్ల కోసం ప్రతీసారి ప్రభుత్వం చుట్టూ తిరగకుండా ఓ శాశ్వత ప్రతిపాదన చేయాలని పవన్ అన్నారు. నిర్మాతలంతా కూలంకషంగా చర్చించుకొని, సినిమా బడ్జెట్‌ను బట్టి రేట్లు ఎంతవరకు పెంచుకోవచ్చు? వారమా? 10 రోజులా? అనే నిర్ణయానికి వస్తే సీఎంతో చర్చిస్తానని పవన్ అన్నారు’ అని Xలో స్పష్టం చేశారు.
Similar News
News January 6, 2026
కంది పంట కోత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కంది పంటలో 80% కాయలు పూర్తిగా పరిపక్వతకు వచ్చిన తర్వాతే కోయాలి. పంట కోతకు 3-4 రోజుల ముందు లీటర్ నీటికి ఇమామెక్టిన్ బెంజోయెట్ 0.4 గ్రా. కలిపి పిచికారీ చేస్తే పంట నిల్వ సమయంలో పెంకు పురుగు ఆశించకుండా కాపాడవచ్చు. నూర్పిడి చేసిన గింజలను బాగా శుభ్రపరిచి చెత్త, ఎండిన ఆకులు, మట్టి మొదలగునవి లేకుండా చేసి 3-4 రోజుల వరకు ఎండబెట్టాలి. గింజలలో 9-10 శాతం తేమ ఉండేటట్లుగా చూసుకోని నిల్వ చేయాలి.
News January 6, 2026
త్వరలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్!

TG: మున్సిపల్ ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. వారం, పది రోజుల్లో షెడ్యూల్ వెలువడొచ్చని CM, PCC చీఫ్ పార్టీ ముఖ్య నేతలను అలర్ట్ చేస్తున్నారు. షెడ్యూల్ లోపే పెండింగ్ పనులు పూర్తిచేయాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా జిల్లాల్లో పెండింగ్ పనులను గుర్తించి పూర్తిచేసేలా నిధులు విడుదల చేయించాలని CM మంత్రులను ఆదేశించినట్లు సమాచారం.
News January 6, 2026
కోహ్లీ ఈజీ ఫార్మాట్ ఎంచుకున్నాడు: మంజ్రేకర్

విరాట్ కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించి, వన్డేల్లో ఆడటాన్ని కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ తప్పుబట్టారు. ‘టెస్టుల్లో జో రూట్ కొత్త శిఖరాలకు చేరుకుంటున్నాడు. కానీ విరాట్ టెస్టులను వదిలేశాడు. రిటైర్మెంట్‌కు ముందు అతడు ఇబ్బందిపడటం నిజమే. కానీ ఎందుకు విఫలమవుతున్నాడనేది మనసు పెట్టి ఆలోచించలేదు. టాప్ ఆర్డర్ బ్యాటర్‌కు ఈజీ ఫార్మాట్ అయిన వన్డేలను కోహ్లీ ఎంచుకోవడం నిరాశకు గురిచేసింది’ అని పేర్కొన్నారు.


