News July 5, 2024
గూడూరు మీదుగా వెళ్ళే పలు రైళ్లు రద్దు

గూడూరు మీదుగా వెళ్లే పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. విజయవాడ డివిజన్ పరిధిలో జరిగే నాన్ ఇంటర్ లాక్ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు3 నుంచి 10వ తేదీ వరకు విజయవాడ-గూడూరు, గూడూరు-విజయవాడ మెమూ, ఆగస్టు 4-11 వరకు విజయవాడ-చెన్నై సెంట్రల్ పినాకిని ఎక్స్ ప్రెస్, ఆగస్టు 5-10 వరకు చెన్నై సెంట్రల్-విజయవాడ జనశతాబ్ధి ఎక్స్ ప్రెస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News March 24, 2026
నెల్లూరు: ఇళ్లను నిర్మించని ఏజెన్సీలకు నోటీసులు

నెల్లూరు జిల్లాలో గత ప్రభుత్వం పేదల ఇళ్ల నిర్మాణాలకు కొన్ని ఏజెన్సీలు ముందుకు వచ్చాయి. చాలా ఏజెన్సీలు ఇళ్ల పనులను మధ్యలో నిలిపి వేశాయి. అయినప్పటికీ పూర్తి స్థాయిలో నిధులు డ్రా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో 29 ఏజెన్సీలకు కలెక్టర్ హిమాన్షూ శుక్లా నోటీసులు జారీ చేశారు. 399 ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి అవకతవకలు జరిగినట్లు సమాచారం.
News March 24, 2026
నెల్లూరు జిల్లాలో కొత్త MLA సీట్లు ఇవేనా..?

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నియోజకవర్గాల పునర్విభజనతో <<19461748>>MLAల సంఖ్య <<>>10 నుంచి 15కి పెరిగే అవకాశం ఉంది. 2009కి ముందు రాపూరు, అల్లూరు నియోజకవర్గాలు ఉండేవి. వీటిని పునరుద్ధరించే అవకాశం ఉంది. 8మండలాలతో ఉదయగిరి, 6మండలాలతో సూళ్లూరుపేట, ఆత్మకూరు పెద్ద నియోజకవర్గాలుగా ఉన్నాయి. వీటి విభజనతో కొత్తది ఏర్పడవచ్చు. ఓట్ల పరంగా నెల్లూరు సిటీ, రూరల్‌తో పాటు మరోక నియోజకవర్గం ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.
News March 24, 2026
నెల్లూరు జిల్లాలో పెరగనున్న MLA సీట్లు..!

ఏపీలో MLA, MP స్థానాలు <<19460921>>పెంపుపై <<>>కేంద్రం చర్చలు జరుపుతోంది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు పెడతారని తెలుస్తోంది. ఇందులో భాగంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనూ సీట్ల సంఖ్య 50శాతం పెరగనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 10 MLA సీట్లు 15కు పెరిగే అవకాశం ఉంది. నెల్లూరు ఎంపీతో పాటు కొన్ని నియోజకవర్గాలు తిరుపతి పార్లమెంట్ కింద ఉన్నాయి. కొత్త బిల్లుతో జిల్లాలోనే 2 ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉంది.


