News July 5, 2024
ఆదిలాబాద్: వారికి రేషన్ బియ్యం రాదు

బోగస్ ఆహార భద్రత కార్డులను ప్రభుత్వం ఏరివేస్తోంది. రేషన్ డీలర్లకు లబ్ధిదారుల జాబితా పంపించి పరిశీలన ప్రక్రియ చేపడుతోంది. క్షేత్రస్థాయిలో అధికారులతో విచారణ చేయించి బోగస్ కార్డులు రద్దు, అనర్హుల పేర్లు తొలగింపునకు చర్యలు చేపట్టింది. ఆదిలాబాద్ జిల్లాలో ఐదు నెలల వ్యవధిలో 89 కార్డులు రద్దు చేయగా, 664 మందిని అనర్హులుగా గుర్తించి తొలగించారు.
Similar News
News November 4, 2025
భీంపూర్ మండలంలో పులి సంచారం కలకలం..!

గత కొన్ని రోజులుగా భీంపూర్ మండలంలో పులి సంచారం కలకలం రేపుతోంది. తాజాగా సోమవారం అంతర్గాం గ్రామస్థుల వ్యవసాయ పొలాల్లో పులి అడుగులు కనిపించాయని రైతులు తెలిపారు. దీంతో సమీప గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి అటవీ అధికారులు వివరాలు వెల్లడించాల్సి ఉంది.
News November 4, 2025
అతివలకు అండగా షీటీం బృందాలు: ADB SP

అతివలకు షీటీం అండగా ఉంటుందని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. పాఠశాల, కళాశాల విద్యార్థినిలకు సైబర్ క్రైమ్, మహిళల వేధింపులపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. మహిళలు ఎలాంటి అత్యవసర పరిస్థితిలోనైనా డయల్ 100, 8712659953 నెంబర్ కి సంప్రదించవచ్చని సూచించారు. జిల్లాలోని హాట్స్పాట్ లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. గత నెలలో రెండు బాల్యవివాహాలు నిలిపివేయడం జరిగిందన్నారు
News November 3, 2025
బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు: ఎస్పీ

బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సోమవారం ఆదిలాబాద్ పోలీసు ముఖ్య కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలనుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజా ఫిర్యాదులపై సత్వరమే స్పందించి విచారణ చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. మొత్తం 38 ఫిర్యాదులు వచ్చినట్లు పేర్కొన్నారు. ఫోన్ ద్వారా సిబ్బందికి పరిష్కారం చూపాలని ఆదేశాలు ఇచ్చారు.


