News July 5, 2024
ఎంట్రీ ఇస్తే మార్కెట్ చరిత్రలో ఇదే అతిపెద్దది!
జియో IPO వస్తే భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓగా నిలవనుంది. ప్రస్తుతం LIC ఐపీఓ (₹21వేల కోట్లు) టాప్‌లో ఉంది. మరోవైపు ₹25వేల కోట్లతో హ్యుందాయ్ ఐపీఓ లాంచ్‌కు సిద్ధంగా ఉంది. కానీ జియో ఐపీఓ ఇందుకు రెండింతలు (₹55,500కోట్లు) ఉంటుందని జెఫరీస్ సంస్థ చెబుతోంది. ₹లక్ష కోట్ల కంటే ఎక్కువ మార్కెట్ విలువ ఉండే సంస్థలు కనిష్ఠంగా 5% షేర్లు ఐపీఓలో పెట్టొచ్చు. కాగా జియో Mcap ₹11.11లక్షల కోట్లుగా ఉంది.
Similar News
News January 17, 2025
‘సంక్రాంతికి వస్తున్నాం’ అదనంగా 220+ షోలు
విక్టరీ వెంకటేశ్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో పబ్లిక్ డిమాండ్ మేరకు ఏపీ, టీజీలో అదనంగా 220కి పైగా షోలు వేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో ఇప్పటికే రెండు రోజుల్లో రూ.77 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా అతిత్వరలోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయమని సినీ విశ్లేషకులు అంటున్నారు.
News January 17, 2025
ఎవరీ సితాంశు?
52 ఏళ్ల సితాంశు కొటక్ 1992-2013 మధ్య కాలంలో సౌరాష్ట్ర తరఫున దేశవాళీ క్రికెట్ ఆడారు. తన ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో 41.76 సగటుతో 8,061 పరుగులు చేశారు. ఇందులో 15 సెంచరీలు, 55 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆయన ప్రతిభను గుర్తించి ఇండియా-ఏ హెడ్ కోచ్‌గా బీసీసీఐ గుర్తించింది. కొటక్ హయాంలో గత నాలుగేళ్లలో బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాల్లో IND-A సత్తా చాటింది.
News January 17, 2025
భారత బ్యాటింగ్ కోచ్‌గా సితాంశు కొటక్!
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో పరాజయం తర్వాత భారత జట్టులో BCCI కీలక మార్పులకు సిద్ధమైంది. అందులో భాగంగానే బ్యాటింగ్ కోచ్‌గా సితాంశు కొటక్‌ను నియమించినట్లు క్రీడావర్గాలు చెబుతున్నాయి. దీనిపై అతిత్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందంటున్నాయి. ఈనెల 22న ఇంగ్లండ్‌తో మొదలయ్యే సిరీస్ నుంచి సితాంశు బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరిస్తారని సమాచారం.