News July 5, 2024
BREAKING: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా సుదర్శన్ రెడ్డి

TG: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా సుదర్శన్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. సుదర్శన్ రెడ్డి ప్రస్తుతం జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. ప్రస్తుత సీఈఓ వికాస్‌రాజ్‌ను ఎన్నికల సంఘం రిలీవ్ చేసింది.
Similar News
News April 10, 2026
ఇంట్లో నోట్ల కట్టలు.. జస్టిస్ వర్మ రాజీనామా

అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు తన రిజైన్ లెటర్‌ను పంపారు. గతేడాది ఢిల్లీలోని జస్టిస్ వర్మ నివాసంలో భారీగా <<17379382>>డబ్బు కట్టలు<<>> బయట పడిన విషయం తెలిసిందే.
News April 10, 2026
మోదీ హత్యకు కుట్ర.. ముగ్గురి అరెస్ట్

ప్రధాని మోదీ హత్యకు కుట్ర చేశారనే ఆరోపణలతో బిహార్ పోలీసులు ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు. తాను మోదీని 22 రోజుల్లో హతమారుస్తానని, భారీగా డబ్బు ఇవ్వాలంటూ అమెరికా నిఘా సంస్థ CIAకు అమన్ తివారీ ఈమెయిల్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు బక్సర్ జిల్లాలో అతడిని అదుపులోకి తీసుకొని మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. తర్వాత అతని ఇద్దరు అనుచరులను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
News April 10, 2026
భారతీయులకు పింక్ లిప్స్ ఎందుకు ఉండవంటే?

భారతీయులకు అమెరికన్లలా సహజంగా పింక్ లిప్స్ ఉండకపోవడానికి ప్రధాన కారణం ‘మెలనిన్’అని మాజీ AIIMS డెర్మటాలజిస్ట్ ఆంచల్ పంత్ వివరించారు. ‘మన చర్మం సూర్యరశ్మి నుంచి రక్షణ పొందేందుకు ఎక్కువ మెలనిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీంతో పెదవులు గోధుమ, నలుపు రంగులో కనిపిస్తాయి. విదేశీయుల్లో మెలనిన్ తక్కువగా ఉండి రక్తనాళాలు బయటకు కనిపిస్తాయి. అందుకే పెదవులు పింక్ కలర్‌లో ఉంటాయి. ఇది జన్యుపరమైన మార్పే’ అని తెలిపారు.


