News July 5, 2024

కస్టమర్ల డేటా లీక్.. ఖండించిన ఎయిర్‌టెల్

image

తమ కస్టమర్ల డేటా హ్యాక్ కాలేదని టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ స్పష్టం చేసింది. తమ ప్రతిష్ఠ దిగజార్చడానికే కొంతమంది కుట్ర పన్నుతున్నారని ఆరోపించింది. తమ సెక్యూరిటీ వ్యవస్థలోకి ఇప్పటివరకు ఎవరూ చొరబడిన ఆనవాళ్లు లేవని పేర్కొంది. డేటా భద్రతలో ఎలాంటి లొసుగులు లేవని తేల్చిచెప్పింది. కాగా ఓ హ్యాకర్ ఎయిర్‌టెల్ కస్టమర్లకు సంబంధించిన డేటాను ఆన్‌లైన్‌లో రూ.50 వేల డాలర్లకు అమ్మకానికి పెట్టినట్లు వార్తలు వచ్చాయి.

Similar News

News October 6, 2024

కాంగ్రెస్ మోసాలపై నిలదీయండి.. యువతకు హరీశ్‌రావు పిలుపు

image

TG: గత ఏడాది దసరా సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను నమ్మి ఆ పార్టీకి ఓటు వేయాలని ప్రచారం చేసిన యువత ఓసారి ఆలోచించాలని హరీశ్‌రావు కోరారు. ‘పింఛన్ పెంచలేదు. పూర్తిగా రుణమాఫీ చేయలేదు. రైతు భరోసాకు దిక్కులేదు. బోనస్‌ను బోగస్ చేశారు. ఉద్యోగాల ఊసులేదు. రూ.4వేల భృతికి నీళ్లు వదిలారు. ఈ దసరాకు సొంతూళ్లకు వస్తున్న వారితో INC మోసాలపై చర్చించండి. ఆ పార్టీ నాయకులను నిలదీయండి’ అని Xలో పిలుపునిచ్చారు.

News October 6, 2024

మోదీ అలా చేస్తే బీజేపీ తరఫున ప్రచారం చేస్తా: కేజ్రీవాల్

image

ప్రధాని మోదీకి ఆప్ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సవాల్ విసిరారు. ఢిల్లీ ఎన్నికలకు ముందు ఎన్డీయే పాలిత 22 రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ ఇస్తే తాను బీజేపీ తరఫున ప్రచారం చేస్తానని స్పష్టం చేశారు. ఢిల్లీలో ప్రజాస్వామ్యం లేదని, లెఫ్టినెంట్ గవర్నర్ రాజ్యం నడుస్తోందని కేజ్రీవాల్ విమర్శించారు. కాగా ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం నెలకు 200 యూనిట్ల లోపు కరెంట్ ఫ్రీగా ఇస్తోంది.

News October 6, 2024

YCP ప్రభుత్వంలో పర్యాటక శాఖ నిర్వీర్యం: మంత్రి కందుల

image

AP: వైసీపీ హయాంలో చాలా టూరిజం ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడంతో పనులు నిలిచిపోయాయని మంత్రి కందుల దుర్గేశ్ విమర్శించారు. పర్యాటక రంగం పూర్తిగా నిర్వీర్యమైందని, భారీగా ఆదాయం కోల్పోయే పరిస్థితి వచ్చిందని దుయ్యబట్టారు. విశాఖలో యాత్రి నివాస్ నిర్మాణాన్ని పట్టించుకోలేదని మండిపడ్డారు. తీరంలో MV MAA Shipను త్వరలోనే పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.