News July 5, 2024
తూ.గో.: మద్యం మత్తులో యువతిపై బ్లేడుతో దాడి

తూ.గో. జిల్లా గోకవరం మండలకేంద్రంలో శుక్రవారం దారుణం జరిగింది. తంటికొండ వెళ్లే దారిలోని అరవపేటలో ఉంటున్న గుర్తుతెలియని వ్యక్తి మద్యం మత్తులో రోడ్డుపై మతిస్థిమితం లేని యువతిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. యువతి పరుగులు తీస్తుండగా బ్లేడుతో ఆమె చేతిపై, ముఖంపై దాడి చేసాడు. స్థానికులు ఆ వ్యక్తిని పట్టుకొని స్తంభానికి కట్టేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వ్యక్తి గత కొంత కాలంగా స్మశానంలో జీవిస్తున్నాడు.
Similar News
News August 31, 2025
దివ్యాంగులకు యథావిధిగా పెన్షన్లు పంపిణీ: కలెక్టర్

సెప్టెంబర్ 1న జిల్లాలోని దివ్యాంగులకు పెన్షన్లు యథావిధిగా పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. జిల్లాలో మొత్తం 2,35,813 మందికి రూ.102.80 కోట్ల ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లు పంపిణీకి ఏర్పాట్లు చేసినట్లు ఆమె ఆదివారం వెల్లడించారు. జిల్లాలోని 33,117 దివ్యాంగుల పెన్షన్లలో కేవలం 33 మంది మినహా మిగిలిన వారందరికీ పెన్షన్లు అందజేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.
News August 31, 2025
ఇకపై డిజిటల్ విధానంలో చెల్లింపులు: కలెక్టర్

ప్రభుత్వం పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో ప్రజలు సులభతరంగా పన్నులు చెల్లించేందుకు స్వర్ణ పంచాయితీ వెబ్ సైట్ ను ప్రవేశపెట్టినట్టు కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. అసెస్మెంట్ ఆధారంగా ప్రజలు ఇంటి పన్నులు డిజిటల్ రూపంలోనే చెల్లించవలసి ఉంటుందన్నారు. ఇకపై డిజిటల్ చెల్లింపులకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. ఈ చెల్లింపులు నేరుగా గ్రామ పంచాయితీ ట్రెజరీ ఖాతాలోనే జమ అవుతాయన్నారు.
News August 31, 2025
రేపు యథావిధిగా పీజీఆర్ఎస్: కలెక్టర్

రాజమండ్రి జిల్లా కలెక్టరేట్లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై నేరుగా అర్జీలు సమర్పించి పరిష్కారం పొందవచ్చని ఆమె సూచించారు. అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని కలెక్టర్ ఆదేశించారు.