News July 5, 2024
మహిళా అథ్లెట్లు ఒలింపిక్స్‌కు ఎంపికవడం గర్వంగా ఉంది: నారా లోకేశ్

ఏపీకి చెందిన మహిళా అథ్లెట్లు 2024 పారిస్ ఒలింపిక్స్‌కు ఎంపికవడం గర్వంగా ఉందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. కొన్నేళ్లుగా దండి జ్యోతికశ్రీ, యర్రాజి జ్యోతి పడిన కష్టానికి మంచి అవకాశం లభించిందన్నారు. కృషి, పట్టుదలతో వారు కచ్చితంగా ఒలింపిక్ మెడల్ అందుకోవాలనే కలను నెరవేర్చుకుంటారన్నారు. ఒలింపిక్స్‌లో మంచి ప్రదర్శన కనబరిచి ఏపీ ప్రజలు గర్వపడేలా చేయాలని లోకేశ్ ఆకాంక్షించారు.
Similar News
News January 25, 2026
గణతంత్ర చరిత్రలో గుంటూరు ఘనకీర్తి

భారత గణతంత్ర చరిత్రలో గుంటూరు జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. 1950లో జరిగిన తొలి గణతంత్ర వేడుకలకు పునాది వేసిన రాజ్యాంగ సభలో జిల్లాకు చెందిన దేశభక్త కొండా వెంకటప్పయ్య, ఎన్.జి.రంగా వంటి మహనీయులు కీలకపాత్ర పోషించారు. స్వాతంత్ర్య ఉద్యమానికి గుంటూరు కంచుకోటగా నిలిచింది. ఆనాటి స్ఫూర్తిని కొనసాగిస్తూ, నేడు 77వ గణతంత్ర దినోత్సవ రాష్ట్రస్థాయి వేడుకలు గుంటూరు జిల్లా పరిధిలోని అమరావతిలో జరగనుండటం విశేషం.
News January 25, 2026
ప్రజాస్వామ్యానికి ఓటే పునాది: కలెక్టర్

జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా గుంటూరు కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే శక్తి ఓటులోనే ఉందని ఆమె పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రతి ఓటు ఎంతో విలువైనదని, ఎన్నికల్లో బాధ్యతాయుతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఓటు వేయడం ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని ఆమె గుర్తుచేశారు.
News January 24, 2026
గుంటూరులో రేపు 10k వాక్

గుంటూరు నగరంలో ఆదివారం 17వ 10k వాక్ ప్రతిష్ఠాత్మకంగా జరగనుంది. MLC ఆలపాటి రాజేంద్రప్రసాద్ నేతృత్వంలో ఉదయం 6 గంటలకు రింగ్ రోడ్డులోని ఇండియన్ స్ర్పింగ్స్ స్కూల్ వద్ద నుంచి వాక్ ప్రారంభం అవుతోంది. సినీ నటులు రాజేంద్రప్రసాద్, కామ్నా జఠ్మలానీ, హాస్యనటులు ఈ కార్యక్రమంలో పాల్గొని అలరించనున్నారు. ఈ మేరకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు.


