News July 5, 2024

14 రోజుల్లో కూలిన 12 బ్రిడ్జిలు.. 11 మంది సస్పెండ్

image

బిహార్‌లో వరుసగా బ్రిడ్జిలు కూలుతున్న ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రత్యేక కమిటీ నివేదిక ఆధారంగా జలవనరుల శాఖకు చెందిన 11మంది ఇంజినీర్లను సస్పెండ్ చేసింది. కూలిపోయిన బ్రిడ్జిల స్థానంలో కొత్తవి నిర్మించాలని ఆదేశించింది. గతంలో వంతెనలు నిర్మించిన కాంట్రాక్టర్లను బాధ్యులుగా చేస్తూ కొత్తవాటి నిర్మాణానికి వారే నిధులు సమకూర్చాలని పేర్కొంది. కాగా బిహార్‌లో 14 రోజుల్లో 12 వంతెనలు కూలిపోయాయి.

Similar News

News October 6, 2024

చంద్రబాబుకు ఇప్పుడు బైబిల్ కావాలి: VSR

image

AP: సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. ‘ముఖ్యమంత్రి చంద్రబాబు మనోగతం’ అంటూ ఓ ట్వీట్ చేశారు. అందులో ‘పవిత్ర రంజాన్, మిలాద్ ఉన్ నబి అయిపోయాయి. పవిత్ర దసరా అయిపోవస్తోంది. పవిత్ర క్రిస్మస్ వస్తుంది‌గా వేషం మార్చాలి. అర్జెంట్‌గా బైబిల్ కావాలి. ఎక్కడ దొరుకుతుంది ఫ్రెండ్స్’ అని రాసుకొచ్చారు. బాబువి ఊసరవెల్లి రాజకీయాలు అని ఆయన విమర్శించారు.

News October 6, 2024

ఏపీ టెట్ ప్రాథమిక ‘కీ’ విడుదల

image

రాష్ట్రంలో జరుగుతున్న టెట్ పరీక్షల ప్రాథమిక ‘కీ’ని పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ఈనెల 3న ప్రారంభమైన పరీక్షలు 21న ముగియనున్నాయి. అయితే ఇప్పటివరకు జరిగిన పరీక్షల కీని వెబ్‌సైట్లో పెట్టింది. మిగిలిన కీలను పరీక్షల తర్వాతి రోజున రిలీజ్ చేయనుంది. మొత్తం 4,27,300 మంది అభ్యర్థులు టెట్‌కు అప్లై చేశారు. ఫైనల్ కీని అక్టోబర్ 27న, నవంబర్ 2న ఫలితాలు విడుదల చేస్తారు.
వెబ్‌సైట్: <>aptet.apcfss.in<<>>

News October 6, 2024

ప్రకటించిన అవార్డులను రద్దు చేయవచ్చా?

image

జాతీయ చలనచిత్ర అవార్డుల రద్దుకు నిర్దిష్ట నిబంధ‌న‌లు లేకపోయినా అడ్మినిస్ట్రేటివ్ లా కింద ర‌ద్దు చేసే అధికారం అవార్డుల క‌మిటీకి ఉంటుంది. ఏ గుర్తింపుకైతే స‌ద‌రు వ్య‌క్తికి అవార్డు ప్ర‌క‌టించారో దానికి సంబంధించి కాపీ రైట్స్, క్రెడిట్స్ అవకతవకలు, ప్రలోభాలకు పాల్పడడం, నేరాభియోగాలపై అవార్డు ర‌ద్దు చేస్తారు. ఈ గ్రౌండ్స్‌పైనే జానీ మాస్ట‌ర్‌కు ప్రకటించిన అవార్డును తాత్కాలికంగా నిలిపివేశారు.