News July 5, 2024

MLCలుగా రామచంద్రయ్య, హరిప్రసాద్ ఏకగ్రీవ ఎన్నిక

image

AP: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా సి.రామచంద్రయ్య, పి.హరిప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీడీపీ తరఫున రామచంద్రయ్య, జనసేన తరఫున హరిప్రసాద్ నామినేషన్ వేశారు. ఇతర పార్టీల నుంచి ఒక్క నామినేషన్ కూడా రాకపోవడంతో వీరిద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఈసీ ప్రకటించింది. అసెంబ్లీలో ఎన్డీఏ కూటమికి ఉన్న సంఖ్యాబలం దృష్ట్యా వీరిద్దరి ఎన్నిక లాంఛనమైంది.

Similar News

News December 31, 2025

EV సేల్స్‌లో టెస్లాను వెనక్కి నెట్టిన BYD

image

టెస్లాను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే అత్యధిక EVలు విక్రయించిన కంపెనీగా చైనాకు చెందిన BYD నిలిచింది. 2025లో ఈ సంస్థ 21 లక్షల వాహనాలను విక్రయించింది. టెస్లా 17 లక్షల దగ్గరే ఆగిపోయింది. ప్లగ్ ఇన్ హైబ్రిడ్ కార్ల విభాగంలో BYD దూసుకుపోతోంది. టెస్లా కేవలం పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ కార్లకే పరిమితమైంది. అమెరికా, యూరప్ దేశాల్లో డిస్కౌంట్లు తగ్గడం కూడా టెస్లా అమ్మకాలపై దెబ్బకొట్టింది.

News December 31, 2025

2025లో కష్టసుఖాల్లో తోడున్న వారికి ‘థాంక్స్’ చెప్పండి!

image

నేటితో 2025 ముగుస్తోంది. ఈ ఏడాది మనకు ఎన్నో మధుర జ్ఞాపకాలను, కొన్ని గుణపాఠాలను ఇచ్చి ఉండొచ్చు. గెలుపులో నవ్వులు, కష్టాల్లో కన్నీళ్లు.. ఇలా ప్రతీ అనుభవం మనల్ని మరింత దృఢంగా మార్చింది. కష్టకాలంలో తోడుగా ఉన్న ఫ్రెండ్స్, ఫ్యామిలీని అస్సలు మర్చిపోకండి. వారికి థాంక్స్ చెప్పండి. డబ్బు, హోదా కంటే కుటుంబంతో గడిపే సమయమే ఎంతో విలువైనదని గుర్తుంచుకోండి. ఈ ఏడాది మీకు మంచి/ చెడు జరిగితే కామెంట్‌లో పంచుకోండి.

News December 31, 2025

నువ్వుల పంటలో ఆకు, కాయ తొలుచు పురుగు-నివారణ

image

ఈ పురుగు తొలి దశలో చిన్న చిన్న గొంగళి పురుగులు లేత ఆకులను కలిపి గూడు ఏర్పాటు చేసుకొని లోపలి నుంచి ఆకుల్లోని పచ్చని పదార్థాన్ని గోకి తినడం వల్ల ఆకులు ఎండిపోతాయి. ఈ పురుగులు ఆకులనే కాకుండా మొగ్గలు, పువ్వులతో పాటు కాయలోని గింజలను కూడా తింటాయి. ఈ పురుగు నివారణకు లీటరు నీటికి క్వినాల్‌ఫాస్ 20ml లేదా క్లోరిఫైరిపాస్ 2.5ml లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములను కలిపి పిచికారీ చేయాలి.