News July 5, 2024
టీచర్ ట్రాన్స్‌ఫర్.. స్కూల్ మారిన 133 మంది స్టూడెంట్స్!

TG: ఉపాధ్యాయుడిపై ప్రేమ, గౌరవంతో 133 మంది విద్యార్థులు స్కూల్ మారారు. మంచిర్యాల జిల్లా జన్నారం(M) పోనకల్ ప్రభుత్వ స్కూల్ టీచర్ జె.శ్రీనివాస్ ఇటీవల అదే మండలంలోని అక్కపెల్లిగూడలోని స్కూలుకు బదిలీ అయ్యారు. తాము అభిమానించే, తమకు స్పెషల్ క్లాసులు చెప్పే గురువు కోసం విద్యార్థులు 3 కి.మీ దూరంలో ఉన్న ఆ పాఠశాలకు మారారు. దీనికి తల్లిదండ్రులు కూడా మద్దతు తెలిపారు.
Similar News
News January 20, 2026
ఏప్రిల్ 20న సింహాచలం చందనోత్సవం

సింహాచలంలో ఏప్రిల్ 20న జరగనున్న లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం ఏర్పాట్లపై ప్రాథమిక సమీక్ష జరిగింది. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మంగళవారం విశాఖ కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. గత అనుభవాల దృష్ట్యా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. కలెక్టర్ హరేంధిర ప్రసాద్, జేసీ, సీపీ, జీవీఎంసీ కమిషనర్, దేవస్థానం ఈవో ఉన్నారు.
News January 20, 2026
తొలి EV ‘అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా’ ఆవిష్కరించిన టయోటా

భారత్‌లో టయోటా తన మొదటి EV ‘అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా’ కారును ఆవిష్కరించింది. LED డీఆర్‌ఎల్స్, ఆకర్షణీయమైన హెడ్ లాంప్స్, డిఫరెంట్ ఫ్రంట్ బంపర్ అమర్చారు. ఇంటీరియర్‌లో సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జర్, పవర్డ్ డ్రైవర్ సీట్, 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్స్ ఉన్నాయి. 61kWh బ్యాటరీ వేరియంట్ 543KM, 49kWh వేరియంట్ 440KM మైలేజీ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది. ఈ కారు ధరను ఇప్పటి వరకు ప్రకటించలేదు.
News January 20, 2026
50 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం: CBN

AP: టెక్నాలజీ సహా వివిధ రంగాల్లోని మార్పులకు అనుగుణంగా పాలసీలు రూపొందిస్తామని CBN పేర్కొన్నారు. ‘దావోస్ సదస్సులో ప్రముఖుల ఆలోచనలతో రాష్ట్రాన్ని బిజినెస్ ఫ్రెండ్లీగా మారుస్తాం. అగ్రి, మెడికల్ రంగాల్లో డ్రోన్లను వినియోగిస్తాం. 2026లో డ్రోన్ అంబులెన్స్ లాంచ్ చేసే ఆలోచన ఉంది. 50L ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేపట్టాలని లక్ష్యం పెట్టుకున్నాం’ అని దావోస్‌లో CII బ్రేక్ ఫాస్ట్ సెషన్‌లో CM పేర్కొన్నారు.


