News July 5, 2024

జూన్‌లో కొత్తగా 42లక్షల డీమ్యాట్ అకౌంట్లు

image

జూన్‌లో రికార్డ్ స్థాయిలో కొత్తగా 42.4లక్షల డీమ్యాట్ అకౌంట్లు నమోదయ్యాయి. ఓ నెలలో నలభై లక్షలకుపైగా అకౌంట్లు క్రియేట్ అవడం ఇది నాలుగోసారి. గతంలో 2023 డిసెంబరు సహా ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఆ స్థాయిలో అకౌంట్లు ఓపెన్ అయ్యాయి. ఇక మొత్తంగా డీమ్యాట్ ఖాతాల సంఖ్య 16.2కోట్లకు చేరింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక మార్కెట్లు రాణిస్తుండటంతో మదుపర్లలో ఆసక్తి పెరుగుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.

Similar News

News March 10, 2026

స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం.. లెక్కలు ఇవి

image

లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పాస్ కావాలంటే సభలో హాజరై, ఓటు వేసిన సభ్యులలో సగం కంటే ఎక్కువ మంది మద్దతు ఉండాలి. అంటే ప్రస్తుతం ఉన్న 543 సభ్యుల్లో 273 మంది సపోర్ట్ అవసరం. ప్రస్తుతం INDIA కూటమి బలం సుమారు 234 సీట్లు. విపక్షాలు అన్నీ ఓటు వేసినా NDA మెజారిటీ (293)ని దాటలేవు. దీంతో తీర్మానం వీగిపోయే అవకాశమే ఎక్కువ. స్పీకర్ ఓం బిర్లా తన పదవిలో కొనసాగే అవకాశమే ఎక్కువగా ఉంది.

News March 10, 2026

AIIMS ఢిల్లీలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

image

AIIMS ఢిల్లీ 16 రీసెర్చ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు మార్చి 11 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MBBS/BDS/BHMS/BUMS /BAMS, పీజీ(ఎపిడిమాలజీ/పబ్లిక్ హెల్త్/కమ్యూనిటీ మెడిసిన్, సోషల్ సైన్సెస్), BSc(నర్సింగ్) అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://www.aiims.edu

News March 10, 2026

నిద్రపోతున్న హనుమంతుడు.. పాదాల చెంత శనిదేవుడు!

image

MH లోనార్‌లో ‘మోతా మారుతి’ ఆలయం అతి పవిత్రమైనది, అరుదైనది. ఇక్కడ హనుమంతుడు భారీ పరిమాణంలో దర్శనమిస్తారు. శయన రూపంలో ఉండటం విశేషం. ఈ విగ్రహం అయస్కాంత శక్తి కలిగిన శిలతో తయారైందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సాక్షాత్తూ శనిదేవుడే ఇక్కడ స్వామివారి పాదాల చెంత సేవకుడిగా ఉంటాడని నమ్ముతారు. ఇక్కడ కొలువైన హనుమంతుడిని ఏలినాటి, సమస్త శని దోషాలు పోతాయని ప్రతీతి. ఆధ్యాత్మికత, అద్భుత శిల్పకళకు ఈ గుడి నిలయం!