News July 5, 2024

రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

AP: రేపు రాష్ట్రంలో పలు చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పు గోదావరి, ఏలూరు, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరుతో పాటు రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంది.

Similar News

News February 2, 2026

జీఎస్టీ వసూళ్లలో తెలంగాణలో 5% వృద్ధి

image

TG: ఈ ఏడాది జనవరిలో GST వసూళ్లలో 5% వృద్ధి నమోదైంది. 2025 జనవరిలో రూ.4,068 కోట్లు రాగా ఈ సారి రూ.4,261 కోట్ల పన్నులు వసూలయ్యాయి. మరోవైపు 2025లో 4 శ్లాబుల జీఎస్టీ రేట్లను రెండుకు తగ్గించడంతో కలెక్షన్లు మందకొడిగా ఉన్నాయని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో పన్ను వసూళ్లలో ఉన్న లోపాలను సరిదిద్ది జీఎస్టీ వసూళ్లను పెంచే మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తోంది.

News February 2, 2026

విజయ్-రష్మిక పెళ్లి ఆ రోజే: TOI

image

విజయ్ దేవరకొండ-రష్మిక <<19017838>>పెళ్లి<<>> ఇవాళ అంటూ సోషల్ మీడియాలో వైరలైన సంగతి తెలిసిందే. అయితే ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి పెళ్లి జరగనున్నట్లు సినీవర్గాలు చెబుతున్నాయని టైమ్స్ ఆఫ్ ఇండియా(TOI) కథనం పేర్కొంది. అటు పెళ్లిపై రష్మిక గానీ విజయ్ గానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. కాగా వీరిద్దరు ‘రణబాలి’ సినిమాలో నటిస్తున్నారు.

News February 2, 2026

అట్లీతో వరుణ్ తేజ్ మూవీ?

image

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సినిమా చేయబోతున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అట్లీ ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో భారీ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ తర్వాత వరుణ్ తేజ్‌తో పనిచేసేందుకు అట్లీ ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయన ఓ పవర్‌ఫుల్ కమర్షియల్ యాక్షన్ కథను సిద్ధం చేశారనే టాక్‌తో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.