News July 5, 2024
30 ఏళ్లలో ఒక్క చీర కూడా కొనలేదు: సుధా మూర్తి

గత 30 ఏళ్లలో తాను ఒక్క చీర కూడా కొనలేదని రాజ్యసభ MP సుధామూర్తి తాజా ఇంటర్వ్యూలో తెలిపారు. ఉన్నవాటినే మళ్లీమళ్లీ కట్టుకుంటానన్నారు. ‘గంగానదిలో నచ్చినది వదిలేస్తే మంచి జరుగుతుందనే నమ్మకంతో నాకు ఇష్టమైన షాపింగ్‌ను కాశీ యాత్రకు వెళ్లినప్పుడు వదిలేశా. అప్పట్నుండి పెద్దగా షాపింగ్ చేయలేదు. మా అమ్మలా పొదుపుగా జీవించాలనుకున్నా. అక్కాచెల్లెళ్లు, స్నేహితులు బహుమతిగా ఇచ్చిన చీరలనే ధరిస్తుంటా’ అని అన్నారు.
Similar News
News January 20, 2026
మాఘ మాసంలో నదీ స్నానాలు ఎందుకు చేయాలి?

మాఘ మాసంలో నదీ స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. సూర్యోదయానికి ముందే స్నానం చేస్తే ప్రయాగలో స్నానం చేసినంత పుణ్యఫలం లభిస్తుందట. శాస్త్రీయంగా చూస్తే.. ఈ సమయంలో సూర్యకిరణాలు ప్రత్యేక కోణంలో భూమిని తాకుతాయి. వాటిలోని అతినీల లోహిత సాంద్రత వల్ల ప్రవహించే నీటిలో చేసే స్నానం శరీరానికి గొప్ప శక్తిని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. చలిని తట్టుకుని చేసే ఈ మాఘ స్నానం మనోబలాన్ని పెంచుతుంది.
News January 20, 2026
మన ఆయుష్షు తగ్గించే కొన్ని అపవిత్ర పనులు

కొన్ని అలవాట్లు మన ఆయుష్షును తగ్గిస్తాయని గరుడ పురాణం చెబుతోంది. దాని ప్రకారం.. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవకపోతే స్వచ్ఛమైన గాలి అందక అనారోగ్యం కలుగుతుంది. రాత్రిపూట పెరుగు, దాంతో చేసినవి తింటే వ్యాధులు రావొచ్చు. దక్షిణ, పడమర దిశలో తలపెట్టి నిద్రించడం, శ్మశానంలో మృతదేహాన్ని దహనం చేసేటప్పుడు వచ్చే విష వాయువు పీల్చడం హానికరం. స్త్రీలు, పిల్లలు, మానవత్వం పట్ల చెడు ఆలోచనలు ఉంటే ఆయుష్షు క్షీణిస్తుంది.
News January 20, 2026
హ్యాట్సాఫ్.. రూ.2కోట్ల ఆస్తిని దానం చేశారు

AP: నంద్యాల జిల్లా జలదుర్గానికి చెందిన పెద్ద వీరభద్రుడు, వెంకటేశ్వరమ్మ దంపతులు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. పిల్లలులేని ఈ దంపతులు తమ యావదాస్తిని మాధవరం రాములవారి గుడికి విరాళమిచ్చారు. దాదాపు రూ.2కోట్ల విలువజేసే ఆస్తి ఆలయానికి చెందేలా రిజిస్ట్రేషన్ చేయించారు. ఒక్క రూపాయి దానం చేయాలన్నా వందసార్లు ఆలోచించే ఈ రోజుల్లో అంత ఆస్తిని గుడికి రాసిచ్చేసిన ఈ దంపతులపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.


