News July 6, 2024

జగిత్యాల జడ్పీ స్పెషల్ ఆఫీసర్‌గా కలెక్టర్

image

జగిత్యాల జిల్లా పరిషత్ పాలకవర్గం పదవీకాలం ముగియడంతో జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్‌ను జడ్పీ స్పెషల్ అధికారిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రఘువరన్, కలెక్టర్‌ను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

Similar News

News March 11, 2026

కరీంనగర్‌లో ‘ఈ-ఆఫీస్’ సేవలు ప్రారంభం

image

పౌర సేవలను మరింత సులభతరం చేసేందుకు కరీంనగర్ నగరపాలక సంస్థలో ‘ఈ-ఆఫీస్’ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తెలిపారు. మంగళవారం టౌన్ ప్లానింగ్ విభాగంలో ఈ సేవలను ఆయన ప్రారంభించారు. ఇకపై అన్ని విభాగాల్లో ఫైళ్లను, ప్రజల ఫిర్యాదులను ఆన్‌లైన్ ద్వారానే వేగంగా పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. పారదర్శక పాలన కోసమే ఈ డిజిటల్ సంస్కరణలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.

News March 10, 2026

KNR: ఐస్‌క్రీం తయారీ కేంద్రంపై దాడులు

image

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అలుగునూరులో నిబంధనలు ఉల్లంఘిస్తున్న ‘ఉత్తమ్ ఐస్ క్రీమ్’ తయారీ కేంద్రాన్ని జిల్లా ఆహార భద్రతా విభాగం అధికారులు తనిఖీ చేశారు. ప్యాకింగ్‌పై చిరునామా, FSSAI లైసెన్స్ నంబర్లు లేకపోవడం, తప్పుడు కేటగిరీలో లైసెన్స్ పొందడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు రూ.6,000 విలువైన స్టాక్‌ను సీజ్ చేసిన అధికారులు, తయారీదారులు వెంటనే లైసెన్సులు పొందాలని ఆదేశించారు.

News March 9, 2026

ప్రజావాణికి 352 దరఖాస్తులు: కలెక్టర్ చిత్రా మిశ్రా

image

ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యమిచ్చి, గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. కరీంనగర్ కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఆమె ప్రజల నుంచి 352 దరఖాస్తులను స్వీకరించారు. వృద్ధులు, దివ్యాంగుల వద్దకే వెళ్లి స్వయంగా వినతులు స్వీకరించిన కలెక్టర్.. సమస్యలపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి సత్వర పరిష్కారం చూపాలని అధికారులకు స్పష్టం చేశారు.