News July 6, 2024
రణస్థలం: మొదటి జీతాన్ని అమరావతికి విరాళం

తన మొదటి నెల జీతాన్ని రాజధాని అమరావతి నిర్మాణానికి విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు రణస్థలంలోని ఎంపీ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. తన జీతం చెక్కుని శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకి అందజేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర రాజధాని నిర్మాణం ఎంతో అవసరమని ఎంపీ కలిశెట్టి అభిప్రాయపడ్డారు.
Similar News
News November 4, 2025
మెలియాపుట్టి: టీచర్ సస్పెండ్

మెలియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థినులతో కాళ్లు పట్టించుకున్న వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మహిళా ఉపాధ్యాయురాలిను సస్పెండ్ చేశారు. ఈ మేరకు సీతంపేట ఐటీడీఏ పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఘటనపై అధికారులు చర్యలు చేపట్టారు.
News November 4, 2025
సంతబొమ్మాళి: ‘చిన్నారులకు ఇస్తున్న వ్యాక్సిన్‌పై నిర్లక్ష్యం తగదు’

చిన్నారులకు క్రమం తప్పకుండా ఇస్తున్న వ్యాక్సిన్‌పై నిర్లక్ష్యం తగదని DyDMHO డాక్టర్ మేరీ కేథరిన్ అన్నారు. సంతబొమ్మాళి మండలం నౌపడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం సందర్శించి పీహెచ్సీ సిబ్బంది, ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. క్రమం తప్పకుండా చిన్నారులకు వ్యాక్సిన్ వేయాలని సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
News November 4, 2025
ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలి: మంత్రి అచ్చెన్న

శ్రీకాకుళం జిల్లాలో మొంథా తుఫాను ప్రభావంతో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. కోటబొమ్మాళిలోని నిమ్మాడ క్యాంప్ కార్యాలయంలో పలు శాఖల అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. అనంతరం నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కష్టకాలంలో ప్రభుత్వం తోడుగా నిలిచిందన్న సంతృప్తి రైతుల్లో కలగాలన్నారు.


