News July 6, 2024

7 మండలాలు తిరిగివ్వాలని తెలంగాణ డిమాండ్

image

TG: విభజన చట్టంలోని అంశాలపై తెలుగు రాష్ట్రాల సీఎంలు రేపు భేటీ కానున్న సంగతి తెలిసిందే. ఈ చర్చల్లో తెలంగాణ పలు ప్రధాన డిమాండ్‌లను ప్రస్తావించనుంది. అందులో ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు కోసం ఏపీలో విలీనం చేసుకున్న ఏడు మండలాలను తిరిగి ఇవ్వాలని ప్రతిపాదించనుంది. టీటీడీలో 42.58 శాతం వాటా, కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్టుల్లో వాటా ఇవ్వాలని అడగనుంది. అలాగే సముద్ర తీరప్రాంతలోనూ వాటా ఇవ్వాలని కోరనుంది.

Similar News

News December 26, 2024

జైల్లో అల్లర్లు: 1500మంది పరారీ.. 33మంది మృతి

image

మొజాంబిక్‌ రాజధాని మపూటోలోని ఓ జైల్లో తాజాగా చెలరేగిన అల్లర్లలో 1534మంది క్రిమినల్స్ జైలు నుంచి పరారు కాగా 33మంది మృతిచెందారు. 15మంది తీవ్రంగా గాయపడ్డారు. ఎన్నికల్లో అధికార పార్టీదే విజయమని ఆ దేశ సుప్రీం కోర్టు ప్రకటించడంతో ప్రతిపక్షాలు మొదలుపెట్టిన అల్లర్లు జైలు వరకూ విస్తరించాయి. 150మందిని తిరిగి పట్టుకున్నామని, మిగిలిన ఖైదీల కోసం గాలింపు చేపట్టామని అధికారులు తెలిపారు.

News December 26, 2024

సీఎం తన తమ్ముడిపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు: హరీశ్

image

TG: సంధ్య థియేటర్ ఘటనను ప్రభుత్వం రాజకీయం చేస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. సినిమా వాళ్లను భయపెట్టి CM మంచి చేసుకోకూడదని హితవు పలికారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ఆయన పరామర్శించారు. రాష్ట్రంలో ఓ సర్పంచి ఆత్మహత్యకు కారణమైన CM తమ్ముడిని ఎందుకు అరెస్ట్ చేయడంలేదని ప్రశ్నించారు. చట్టం అందరికీ సమానమన్న ముఖ్యమంత్రి, తన తమ్ముడిపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ధ్వజమెత్తారు.

News December 26, 2024

రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని పేర్కొంది. అటు తెలంగాణలోనూ పలు జిల్లాల్లో రేపు వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.