News July 6, 2024
నేడు పులివెందులకు మాజీ సీఎం జగన్

AP: వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేటి నుంచి 3 రోజులు పులివెందులలో పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం గన్నవరం నుంచి కడప ఎయిర్‌పోర్టుకి జగన్ చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పులివెందుల వెళ్తారు. 2 రోజుల పాటు ఆయన కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఈ నెల 8న ఇడుపులపాయలో వైఎస్సార్ జయంతి కార్యక్రమంలో పాల్గొంటారు.
Similar News
News March 25, 2026
అత్యంత కాలుష్య పట్టణం మన దేశంలోనే..

ప్రపంచంలో అత్యంత కాలుష్య పట్టణంగా లోనీ(UP) నిలిచింది. స్విస్ సంస్థ IQఎయిర్ విడుదల చేసిన గ్లోబల్ ర్యాంకింగ్స్-2025లో ఈ విషయం వెల్లడైంది. అత్యంత కలుషితమైన రాజధానుల జాబితాలో న్యూఢిల్లీ టాప్‌లో ఉంది. అదే సమయంలో వరల్డ్స్ మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీగా పాకిస్థాన్ నిలిచింది. ఈ లిస్టులో ఇండియా 6వ ప్లేస్‌లో ఉంది. 2025 నాటికి ప్రపంచంలో కేవలం 14% నగరాలు మాత్రమే WHO ఎయిర్ క్వాలిటీ ప్రమాణాన్ని అందుకున్నాయి.
News March 24, 2026
RCB అమ్మకం.. కొత్త ఓనర్ ఎవరంటే?

RCB జట్టును ఆదిత్య బిర్లా గ్రూప్ నేతృత్వంలోని కన్సార్షియం కొనుగోలు చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఈ కన్సార్షియంలో బిర్లా గ్రూప్, US కంపెనీలు డేవిడ్ బ్లిట్జర్, బ్లాక్ స్టోన్, టైమ్స్ ఆఫ్ ఇండియా భాగస్వాములుగా ఉన్నట్లు తెలుస్తోంది. సుమారు $1.78Bతో(₹16,706Cr) ఒప్పందం జరిగినట్లు సమాచారం. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. ప్రస్తుతం ఈ ఫ్రాంచైజీకి యునైటెడ్ స్పిరిట్స్(Diageo) యజమానిగా ఉంది.
News March 24, 2026
ఇరాన్-US చర్చలకు సిద్ధమన్న పాక్.. స్పందించిన ట్రంప్!

ఇరాన్, అమెరికా మధ్య శాంతి చర్చలకు ఆతిథ్యమిచ్చేందుకు తాము సిద్ధమని పాకిస్థాన్ ప్రకటించింది. దీనిపై పాక్ PM షరీఫ్ చేసిన ట్వీట్‌ను US అధ్యక్షుడు ట్రంప్ రీపోస్ట్ చేశారు. పరోక్షంగా పాక్ రిక్వెస్ట్‌ను స్వాగతించారు. మరోవైపు ఇస్లామాబాద్‌కు US ఉపాధ్యక్షుడు JD వాన్స్ వెళ్తున్నట్లు Axios మీడియా సంస్థ తెలిపింది. అక్కడ ఇరాన్ ప్రతినిధులతో విట్కాఫ్, కుష్నెర్‌తో కలిసి చర్చల్లో పాల్గొంటారని వెల్లడించింది.


