News July 6, 2024

అమరావతి ORRకి కేంద్రం గ్రీన్ సిగ్నల్

image

AP: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపింది. భూసేకరణ సహా మొత్తం రూ.20-25 వేల కోట్లకు పైగా నిర్మాణ వ్యయాన్ని భరించనుంది. ఉమ్మడి కృష్ణా, GNT జిల్లాల్లో CRDA పరిధిలో 189కి.మీ మేర ఈ ORRని నిర్మిస్తారు. అలాగే VJA తూర్పు బైపాస్ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. అమరావతి- HYD మధ్య 6 వరుసల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే, మేదరమెట్ల- అమరావతి రహదారి ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించింది.

Similar News

News January 17, 2025

8th పే కమిషన్.. భారీగా పెరగనున్న జీతాలు, పెన్షన్లు!

image

8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2016లో 7th పే కమిషన్ ఏర్పాటుచేయగా, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57గా ఉంది. దీంతో బేసిక్ శాలరీ ₹7K నుంచి ₹18Kకు పెరిగింది. ఇప్పుడు 8వ కమిషన్‌లో ఫిట్‌మెంట్ 2.86 ఉంటుందని, బేసిక్ జీతం ₹51,480కి పెరుగుతుందని నిపుణుల అంచనా. కనీస పెన్షన్ ₹9K నుంచి ₹20+Kకి పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు.

News January 17, 2025

స్టీల్ ప్లాంట్ పరిరక్షణ హామీని కేంద్రం నిలబెట్టుకుంది: రామ్మోహన్

image

విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు నినాదాన్ని కేంద్రం కాపాడిందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. స్టీల్ ప్లాంట్‌కు డైరెక్ట్ ఈక్విటీ కింద రూ.10,300Cr, షేర్ క్యాపిటల్ కింద రూ.1,140Cr బదిలీ చేసేలా కేంద్రం సహాయ సహకారాలు అందిస్తుందని వెల్లడించారు. దీంతో ప్లాంట్ పరిరక్షణకు ఇచ్చిన హామీని కేంద్రం నిలబెట్టుకుందని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా నెలకొన్న సమస్యల పరిష్కారానికి అడుగులు పడ్డాయని పేర్కొన్నారు.

News January 17, 2025

ఏపీ ప్రజలు గర్వించే విషయమిది: సీఎం చంద్రబాబు

image

AP: స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం రూ.11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించడం చరిత్రాత్మక నిర్ణయమని సీఎం చంద్రబాబు అభివర్ణించారు. ఇది ఏపీ ప్రజలు గర్వించదగ్గ విషయమని అన్నారు. ఈమేరకు ఆయన ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, కుమారస్వామికి కృతజ్ఞతలు తెలిపారు. విశాఖ ఉక్కు అంటే పరిశ్రమ మాత్రమే కాదని, దీనికి ఆంధ్రుల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉందన్నారు.