News July 6, 2024

హైస్కూల్ ప్లస్‌లలో బోధనకు SAల కేటాయింపు

image

AP: రాష్ట్రంలో 210 హైస్కూల్ ప్లస్‌లలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు ప్రభుత్వం స్కూల్ అసిస్టెంట్ల(SA)ను కేటాయించింది. గత ప్రభుత్వం మండలానికో కో-ఎడ్యుకేషన్, బాలికలకు ప్రత్యేక కాలేజీల ఏర్పాటుకు ఆదేశాలిచ్చింది. కానీ అధ్యాపకులను నియమించలేదు. అయితే ఈ విద్యాసంవత్సరం నుంచి వీటిని ప్రారంభించారు. విద్యాశాఖ కోరిక మేరకు ఆయా బడుల్లో ఉన్న SAలను ప్రభుత్వం సర్దుబాటు చేసింది.

Similar News

News October 5, 2024

పెరగనున్న పత్తి ధరలు?

image

TG: రానున్న రోజుల్లో పత్తి ధరలు పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఖమ్మం మార్కెట్‌లో నిన్న కొత్త పత్తి క్వింటాల్‌కు గరిష్ఠంగా ₹7,111, మోడల్ ధర ₹6,500, కనిష్ఠంగా ₹4,500 పలికింది. పాత పత్తికి గరిష్ఠంగా ₹7550, కనిష్ఠ ధర ₹4,500గా ఉంది. వరంగల్ మార్కెట్‌లో గరిష్ఠంగా ₹7,600, మోడల్ ₹6,600, కనిష్ఠ ధర ₹5,500 వరకు పలికిందని, కొత్త పత్తి ₹7,600కు పైగానే పలుకుతోందని వ్యాపారులు తెలిపారు.

News October 5, 2024

సోడాలు, కాఫీలు ఎక్కువ తాగుతున్నారా..?

image

సోడాలు, కాఫీలు ఎక్కువగా తాగేవారికి పక్షవాతం ముప్పు ఉందంటూ గాల్వే వర్సిటీ పరిశోధకులు హెచ్చరించారు. వాటి వలన డయాబెటిస్, బీపీ పెరుగుతాయని వివరించారు. ఇక కంపెనీలు తయారు చేసే జ్యూస్‌లలో కృత్రిమ షుగర్లు, ప్రిజర్వేటివ్స్ ఉంటాయని, పెరాలసిస్ స్ట్రోక్ ముప్పును పెంచుతాయని హెచ్చరించారు. వాటి బదులు సహజమైన పళ్లరసాలు శ్రేయస్కరమని సూచించారు. ఏం తిన్నా, ఏం తినకపోయినా సమస్యే అన్నట్లుగా తయారైంది నేటి పరిస్థితి.

News October 5, 2024

ABHIMANYU: అసాధారణంగా ఆడుతున్నా అవకాశమేదీ?

image

దేశవాళీ క్రికెట్‌లో ఉత్తరాఖండ్ ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్ తన సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నారు. కానీ టీమ్ ఇండియా ఎంట్రీ మాత్రం ఆయనకు అందని ద్రాక్షగా మారిందని నెటిజన్లు అంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఇరానీ ట్రోఫీలోనూ 191 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడారు. 166 ఫస్ట్ క్లాస్ ఇన్నింగ్స్‌ల్లో 26 సెంచరీలతో 7,506 పరుగులు చేశారు. 29 ఏళ్ల అభిమన్యును బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి సెలక్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.