News July 6, 2024
తూ.గో: ఉరేసుకుంటున్నానంటూ ప్రియుడికి వీడియో కాల్

నిడదవోలుకు చెందిన 22ఏళ్ల యువతి తాడేపల్లిగూడెంలో నర్సుగా పనిచేస్తుంది. కపిలేశ్వరపురానికి చెందిన రాజేశ్, సదరు యువతి రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. రాజేశ్‌కి ఏడాది కింద పెళ్లైంది. అయినా వీరి ప్రేమ కొనసాగింది. తనను 2వ పెళ్లి చేసుకోవాలని యువతి రాజేశ్‌ను కోరగా.. పెద్దలు అంగీకరిస్తే చేసుకుంటానన్నాడు. ఆమె బంధువులు తిరస్కరించగా.. ప్రియుడికి వీడియో కాల్ చేసి ఉరేసుకొని ఆత్మహత్యకు యత్నించింది.
Similar News
News March 15, 2026
టెన్త్ పరీక్షలకు పటిష్టమైన బందోబస్తు: జిల్లా ఎస్పీ

టెన్త్ పరీక్షలు రాస్తున్న ప్రతి విద్యార్థి సమయానికి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ సూచించారు. 16 నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి రాత పరీక్షల సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బందితో పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నా రు. బందోబస్తు నిర్వహిస్తున్న సిబ్బంది, అభ్యర్థులు సెల్ ఫోన్స్ అనుమతించమన్నారు.

News March 14, 2026
రాజమండ్రి: లోక్ అదాలత్‌లో 18,441 కేసుల పరిష్కారం

జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 18,441 కేసులు పరిష్కారమైనట్లు జిల్లా ప్రధాన న్యాయాధికారి గంధం సునీత తెలిపారు. 17,672 క్రిమినల్, 630 సివిల్, 139 ప్రీ-లిటిగేషన్ కేసులు ఉన్నాయి. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న 18,302 కేసులకు మోక్షం లభించడంతో కక్షిదారులకు ఊరట లభించింది. పరస్పర అంగీకారంతో రాజీ పడటం ద్వారా సమయం ఆదా అవుతుందని, బాధితులకు త్వరితగతిన న్యాయం అందుతుందని ఆమె పేర్కొన్నారు.