News July 6, 2024

ఉమ్మడి నల్గొండ జిల్లాలో హర్రర్ గ్యాంగ్

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రమాదకరమైన హర్రర్ గ్యాంగ్ పార్థి ముఠా చోరీలు పెరిగాయి. హైవే వెంట, పట్టణాల్లో వీరి ఆగడాలు ఎక్కువయ్యాయి. శుక్రవారం పెద్ద అంబర్ పేట్ శివారులో ఇద్దరు ముఠా సభ్యులను పోలీసులు పట్టుకున్నారు. కట్టంగూర్ వద్ద రహదారి వెంబడి మే 18న జరిగిన హత్య తామే చేసినట్లు వారు ఒప్పుకున్నారు. శుక్రవారం ఉదయం పోలీసులకు దొరికే ముందు కూడా చౌటుప్పల్‌లో ఓ ఇంట్లో కత్తులతో బెదిరించి బంగారం ఎత్తుకెళ్లారు.

Similar News

News March 10, 2026

నల్గొండ: నెల రోజుల పాటు పదో తరగతి పరీక్షలు

image

ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు నెల రోజుల పాటు సాగనున్నాయి. మొత్తం 6 పరీక్షలే ఉన్నప్పటికీ, ప్రతి పేపర్‌కు మధ్య 4 నుంచి 6 రోజుల విరామం ఉండటంతో ఏప్రిల్ మధ్య వరకు షెడ్యూల్ ఖరారైంది. విద్యార్థులు ఒత్తిడి లేకుండా, ప్రశాంతంగా ప్రిపేర్ అయ్యేందుకు SSC బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో పరీక్షలు త్వరగా ముగిసేవి, కానీ ఈసారి ప్రతి సబ్జెక్టుకు తగినంత సమయం లభించడంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News March 10, 2026

నల్గొండ: బర్డ్ ఫ్లూ భయం.. అధికారి క్లారిటీ

image

నల్గొండ జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి ఆనవాళ్లు లేవని జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి డాక్టర్ రమేష్ స్పష్టం చేశారు. జిల్లాలో కోళ్లు ఆరోగ్యంగా ఉన్నాయని, ఎక్కడా చనిపోయినట్లు ఫిర్యాదులు అందలేదని ఆయన తెలిపారు. ప్రజలు బర్డ్ ఫ్లూ గురించి వస్తున్న పుకార్లను నమ్మవద్దని, భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. పౌల్ట్రీ రైతులు అప్రమత్తంగా ఉండి ఏవైనా అనుమానాలు ఉంటే అధికారులను సంప్రదించాలని సూచించారు.

News March 10, 2026

నేటి నుంచి పశువులకు గాలికుంటు నివారణ టీకాలు

image

పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణ కోసం జిల్లా పశువైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నేటి నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు టీకాల కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 2,25,869 తెల్లజాతి, 3,17,279 నల్లజాతి పశువులకు టీకాలను వేయనున్నారు. 3 నెలల వయస్సు వయస్సు నిండిన వాటికి టీకాలు వేయనున్నట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ రమేష్ తెలిపారు.