News July 6, 2024
KNR: ఈ నెల 7న సివిల్స్ ఆన్‌లైన్ స్క్రీనింగ్ పరీక్ష

బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని బీసీ స్టడీ సర్కిల్ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సివిల్స్ లాంగ్ టర్మ్ ఉచిత శిక్షణ కోసం ఈ నెల 7న ఆన్ లైన్ స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించనున్నట్లు కరీంనగర్ బీసీ స్టడీ సర్కిల్ డైరక్టర్ డాక్టర్ రవి కుమార్ తెలిపారు. అభ్యర్థులు వెబ్ సైట్ www.studycircle.cgg.gov.in ద్వారా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
Similar News
News March 17, 2026
జమ్మికుంట: స్వల్పంగా తగ్గిన పత్తి గరిష్ఠ ధర

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధరలు మంగళవారం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. సోమవారం గరిష్ఠంగా రూ.7,500 పలికిన పత్తి ధర నేడు రూ.50 తగ్గి రూ.7,450 వద్ద నిలిచింది. మార్కెట్‌కు మొత్తం 24 వాహనాల్లో 145 క్వింటాళ్ల విడి పత్తి విక్రయానికి వచ్చింది. ధర తగ్గడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరలు పెరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
News March 15, 2026
KNR: ‘స్కిల్ డెవలప్‌మెంట్‌తోనే నిరుద్యోగ సమస్యకు పరిష్కారం’

స్కిల్ డెవలప్‌మెంట్‌తోనే నిరుద్యోగ సమస్యకు పరిష్కారం ఉంటుందని తెలంగాణ విఠల్ నిరుద్యోగ జేఏసీ నేత పాలకూర అశోక్ అన్నారు. కరీంనగర్ ఫిలిమ్ భవన్లో డా.బీఎన్.రావు అధ్యక్షతన ‘ఉద్యోగ సమస్య – పరిష్కార మార్గాలు’ అనే అంశంపై నిరుద్యోగ సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. సహజ వనరులు అధికంగా ఉన్న తెలంగాణలో రాజకీయ వనరులకోసం పరిపాలన జరుగుతుంది తప్ప ఉత్తమ ఉద్యోగ పాలసీని తయారు చేయలేక పోతున్నారని విమర్శించారు.
News March 15, 2026
కరీంనగర్: ఎస్సీ యువతకు GOOD NEWS

జిల్లా షెడ్యూల్ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం లిమిటెడ్ కరీంనగర్ ఆధ్వర్యంలో ఎస్సీ యాక్షన్ ప్లాన్ 2025 -26 ఎస్సీ వర్గాల ఆర్థిక అభివృద్ధి కోసం రవాణా, వ్యవసాయ రంగంలో స్వయం ఉపాధి పథకాలు అమలు చేస్తునట్లు కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు. ఆసక్తిగల ఎస్సీ అభ్యర్థులు ఓబీ ఎంఎంఎస్ పోర్టల్ ద్వారా ఈ నెల 17 నుంచి 24 వరకు ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.


