News July 6, 2024

చంద్రబాబుపై కేసులన్నింటినీ సీబీఐకి అప్పగించాలి: హైకోర్టులో పిల్

image

AP: CM చంద్రబాబు, మంత్రులు, నేతలపై నమోదైన కేసులను CBI, EDకి అప్పగించాలంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. అమరావతి IRR, స్కిల్, లిక్కర్, ఫైబర్ నెట్ స్కామ్‌లపై నిష్పాక్షిక దర్యాప్తు జరిగే అవకాశాలు లేవని జర్నలిస్ట్ బాలగంగాధర తిలక్ కోర్టుకు తెలిపారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజే అప్పటి DGP హరీశ్ CID ఆఫీస్‌ను లాక్ చేశారన్నారు. మొత్తంగా 114 మందిని ప్రతివాదులుగా చేర్చారు. దీనిపై త్వరలోనే విచారణ జరగనుంది.

Similar News

News December 27, 2025

U-19 WC: టీమ్ ఇండియా ఇదే..

image

సౌతాఫ్రికా సిరీ‌స్‌తో పాటు మెన్స్ U-19 WCకు భారత జట్టును BCCI ప్రకటించింది. ఆసియాకప్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన ఆయుశ్ మాత్రేకు మరోసారి బాధ్యతలు అప్పగించింది.
జట్టు: ఆయుశ్(C), విహాన్(VC), వైభవ్ సూర్యవంశీ, అరోన్ జార్జి, వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్, హర్వంశ్ సింగ్, అంబ్రీశ్, కనిశ్క్ చౌహన్, ఖిలాన్ పటేల్, మహ్మద్ ఈనాన్, హెనిల్ పటేల్, దీపేశ్, కిషాన్ సింగ్, ఉధవ్ మోహన్

News December 27, 2025

2026: ఈ రోజుల్లో బ్యాంకులకు సెలవులు

image

వచ్చే ఏడాదిలో బ్యాంకుల సెలవుల జాబితాను RBI వెల్లడించింది. ప్రాంతీయ పండుగలను బట్టి తెలుగు రాష్ట్రాల్లో సెలవు రోజులు ఇవే..
✮JAN: 15, 26, ✮FEB: No holidays, ✮MAR:3, 19, 20(AP), 21(TG), 27, ✮APRIL: 1, 3, 14, ✮MAY, 1, 27, ✮JUNE: 25(AP), 26(TG), ✮JULY: No holidays, ✮AUG: 15, 25(AP), 26(TG), ✮SEP: 4, 14, ✮OCT: 2, 20, ✮NOV: 24(TG), ✮DEC: 25.
✮ ప్రతి నెలా ఆదివారం, రెండో, నాలుగో శనివారం అదనం.

News December 27, 2025

Money Tip: ఈ లీకులను అరికడితేనే..

image

తెలియకుండానే మన డబ్బు అనవసర ఖర్చుల రూపంలో వృథా అవుతుంటుంది. వినియోగించని సబ్‌స్క్రిప్షన్లు, అరుదుగా వెళ్లే జిమ్ మెంబర్‌షిప్‌లు, బ్యాంకు ఛార్జీల పట్ల జాగ్రత్తగా ఉండాలి. బయట భోజనం, ఖరీదైన కాఫీ అలవాట్లను తగ్గించి ఇంట్లోనే తింటే భారీగా ఆదా చేయొచ్చు. ఇలాంటి ఖర్చులను Invisible Leaks అంటారు. వీటిని అరికట్టి ఆదా చేసిన డబ్బును ప్రతినెలా ఇన్వెస్ట్ చేస్తే పెద్దమొత్తంలో సంపదను సృష్టించొచ్చు.