News July 6, 2024
నెల్లూరు: ఎస్సీ కార్పొరేషన్ ఈఓ సస్పెండ్

ఎస్సీ కార్పొరేషన్ ఈఓ సెల్విని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సీ కార్పొరేషన్లో కొన్ని రకాల ఉద్యోగోన్నతుల నియామకాలు నిబంధనలకు విరుద్ధంగా జరిగాయని రాష్ట్ర ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. దీనిపై విచారణ జరిపిన గత నెల్లూరు కలెక్టర్ హరినారాయణన్ ఉన్నతాధికారులకు నివేదికను పంపారు. దీంతో ఈఓపై సస్పెన్షన్ వేటు పడింది.
Similar News
News January 19, 2026
నెల్లూరు: విజయ డెయిరీ ఛైర్మన్‌గా ప్రసాద్ నాయుడు.?

నెల్లూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల ప్రయోజనాలే లక్ష్యంగా టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. విజయ డైరీ (పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సమితి) ఛైర్మన్ అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం కోరుటూరుకి చెందిన ఆర్.వి. ప్రసాద్ నాయుడును ఖరారు చేసింది.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఆయన ఎంపిక లాంఛనమే కానుంది.
News January 19, 2026
నెల్లూరు: నేడు పాఠశాలలు ప్రారంభం

సంక్రాంతి పండుగ సెలవులు ముగియడంతో జిల్లావ్యాప్తంగా నేడు పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే విద్యార్థులతో స్కూల్ ప్రాంగణాలు కిటకిటలాడాయి. ఉపాధ్యాయులు హాజరై తరగతులు నిర్వహించారు. సెలవుల తరువాత మళ్లీ చదువుల వాతావరణం నెలకొనడంతో విద్యార్థుల్లో ఉత్సాహం కనిపించింది. తల్లిదండ్రులు పిల్లలను స్కూళ్లకు పంపుతూ హర్షం వ్యక్తం చేశారు.
News January 19, 2026
నెల్లూరు: 108 వాహనాల్లో పైలెట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

నెల్లూరు జిల్లాలో 108 వాహనాల్లో పైలెట్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మేనేజర్ అశోక్ ఆదివారం ఒక ప్రకటన తెలిపారు. పదవ తరగతి ఉత్తీర్ణులై హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారు జనవరి 21, 22వ తేదీలలో తిరుపతి జిల్లా అలిపిరి రోడ్డులోని DMHO కార్యాలయం నందు హాజరుకావాలని సూచించారు.


