News July 6, 2024

జిల్లాలో ఆయ’కట్’కట

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 124 ఎత్తిపోతల పథకాల కింద 32,880 ఎకరాల ఆయకట్టు ఉంది. వీటిలో 74 ఎత్తిపోతల పథకాలు సాగునీరందిస్తున్నాయి. 50 లిఫ్టులు పూర్తిగా పడకేశాయి. కొన్నేళ్లుగా మరమ్మతులకు నోచుకోని ఎత్తిపోతల పథకాలను వినియోగంలోకి తెచ్చేందుకు ఉభయ జిల్లాల అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. నిధులు మంజూరైనా పనులు జాప్యమవటంతో ఈ సీజన్కు సాగునీరందే పరిస్థితి లేకుండా పోయింది.

Similar News

News February 2, 2026

ఖమ్మం: ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్

image

ప్రజావాణిలో అందిన దరఖాస్తులపై అధికారులు స్పందించి పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి స్వయంగా వినతులు స్వీకరించారు. ఉపాధి, భూ సమస్యలు, పెన్షన్లు, గృహాల కోసం వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖలకు బదిలీ చేసి, విచారణ వేగవంతం చేయాలని సూచించారు. విధుల్లో ఉత్తమ సేవలు అందించి పదవీ విరమణ చేసిన 7గురు అధికారులను కలెక్టర్ సన్మానించారు.

News February 2, 2026

సత్తుపల్లి ఆలయంలో చిల్లర వదిలెళ్లారు

image

సత్తుపల్లి జవహర్ నగర్‌లోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. అర్ధరాత్రి గడ్డపలుగుతో హుండీని పగులగొట్టిన దొంగలు, అందులోని సుమారు రూ.20 వేల నోట్లను ఎత్తుకెళ్లారు. అయితే, బరువుగా ఉన్నాయనో ఏమో కానీ సుమారు రూ.5 వేల విలువైన నాణేలను అక్కడే వదిలి వెళ్లడం గమనార్హం. ఆలయ కమిటీ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News February 2, 2026

పోటాపోటీ నామినేషన్లు.. వైరాలో ఎమ్మెల్యే రాజీ ఫార్ములా

image

వైరాలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వర్గాల నుంచి పోటాపోటీగా నామినేషన్లు దాఖలు కావడంతో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ రంగంలోకి దిగారు. ఆయన మంత్రి పొంగులేటితో చర్చించి, ఒక వర్గానికి ఛైర్మన్, మరో వర్గానికి వైస్ ఛైర్మన్ పదవి ఇచ్చేలా రాజీ కుదిర్చారు. ముఖ్య నేతలకు భవిష్యత్తులో పదవులు ఇస్తామని హామీ ఇవ్వడంతో ప్రస్తుతానికి అంతర్గత విభేదాలు సద్దుమణిగినట్లు కనిపిస్తోంది.