News July 6, 2024

చర్చిలో లైంగిక వేధింపులు.. బాధితులకు $76 మిలియన్లు

image

కెనడాలోని ఓ చర్చి నిర్వహిస్తున్న అనాథాశ్రమంలో చిన్నారులపై ప్రీస్ట్‌లు, ఇతర చర్చి అధికారులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. 1940 నుంచి కొనసాగుతున్న ఈ దురాగతం 2020లో వెలుగులోకి వచ్చింది. ఆ దేశ చరిత్రలోనే అతిపెద్ద లైంగిక వేధింపుల కుంభకోణంగా నిలిచింది. ఈ కేసును విచారించిన కోర్టు 292 మంది బాధితులకు $76 మిలియన్లు పరిహారం చెల్లించాలని ఇటీవల ఆదేశించింది. ఒక్కొక్కరు $40వేలు-$6లక్షల మధ్య అందుకోనున్నారు.

Similar News

News March 18, 2026

నల్గొండ: మత సామరస్యానికి ప్రతీక రంజాన్: కలెక్టర్

image

రంజాన్ పర్వదినాన్ని సోదరభావంతో జరుపుకోవాలని కలెక్టర్ చంద్రశేఖర్ ఆకాంక్షించారు. బుధవారం స్టార్ ఫంక్షన్ హాల్‌లో ప్రభుత్వ ‘దావత్-ఏ-ఇఫ్తార్’లో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో 5,250 మంది పేద ముస్లింలకు ప్రభుత్వం రంజాన్ తోఫా అందజేస్తోందని తెలిపారు. మైనార్టీల సామాజిక, ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, అధికారులు పాల్గొన్నారు.

News March 18, 2026

3వేల డీజిల్ బస్సులు ఈవీలుగా..: CM

image

TG: హైదరాబాద్‌లో కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రస్తుతం తిరుగుతున్న 3వేల డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మారుస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అలాగే పెట్రోల్‌తో నడిచే ఆటోలనూ ఈవీలుగా మార్చే కార్యాచరణ చేపడుతున్నామన్నారు. కోర్ సిటీలోని పరిశ్రమలను నగరం వెలుపలకు తరలిస్తామని చెప్పారు. కోర్ సిటీలో సర్వీస్ సెక్టార్ మాత్రమే ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు.

News March 18, 2026

వరి పండిస్తే అత్యధిక లాభం రాదు: రేవంత్

image

TG: రైతులు వరి కాకుండా ఇతర పంటల వైపు మళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ‘వరి పండిస్తే రైతులకు అత్యధిక లాభం రాదు. వరి నుంచి వాణిజ్య, కూరగాయల పంటలవైపు మళ్లాలి. ప్రపంచానికి ఎగుమతి చేసేలా తెలంగాణను తీర్చిదిద్దుతాం. సైంటిస్టులతో భూసార పరీక్షలు చేయించి ఏ పంట వేయాలో చెబుతాం. రైతును రాజును చేస్తాం. రైతు రుణమాఫీ చేశాం. సన్నవడ్లకు రూ.500 బోనస్ ఇచ్చాం’ అని అసెంబ్లీలో తెలిపారు.