News July 6, 2024
వారికి పరిహారం సరికాదు.. మద్రాస్ హైకోర్టులో పిల్

తమిళనాడులో కల్తీసారా ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.10లక్షల పరిహారం ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మద్రాస్ హైకోర్టులో పిల్ దాఖలైంది. వారేమీ స్వాతంత్ర్య సమరయోధులు, సామాజిక కార్యకర్తలు కాదని గౌస్ తన పిల్‌లో పేర్కొన్నారు. ప్రమాదవశాత్తూ మరణించిన వారి కుటుంబాలకే ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలన్నారు. కల్తీసారా తాగి మరణించిన ఘటనలో ఇవ్వడం సరికాదని తెలిపారు. దీనిపై కోర్టు విచారణను 2వారాలకు వాయిదా వేసింది.
Similar News
News April 8, 2026
హార్ముజ్‌పై టోల్స్ విధిస్తే ఒప్పుకోం: ఒమన్

హార్ముజ్ జలసంధిపై టోల్స్ విధించేందుకు అనుమతించాలన్న ఇరాన్ సీజ్‌ఫైర్ డిమాండ్‌ను పొరుగు దేశమైన ఒమన్ తప్పుపట్టింది. అది అంతర్జాతీయ జలమార్గమని దానిపై ఫీజు వసూలు చేయడం సరికాదని ఒమన్ ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్ పేర్కొన్నారు. దీనిపై గతంలో ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నట్లు తెలిపారు. కాగా అంతకుముందు హార్ముజ్‌పై టోల్స్‌కు ఇరాన్, ఒమన్ అంగీకరించాయని ఇరాన్ మీడియా పేర్కొంది.
News April 8, 2026
సీజ్‌ఫైర్ వేళ.. UAE, కువైట్‌పై ఇరాన్ దాడి

తమ దేశంలోని లవన్ రిఫైనరీపై దాడికి ప్రతీకారంగా UAE, కువైట్‌పై ఇరాన్ విరుచుకుపడింది. మిడిల్ ఈస్ట్‌లోని ఆ రెండు దేశాలపై మిస్సైల్స్ ప్రయోగించింది. ఒకవైపు సీజ్‌ఫైర్ అమల్లో ఉండగానే తమపై దాడి జరిగిందని ఇరాన్ చెప్తోంది. అందుకే అమెరికాకు మద్దతిస్తున్న గల్ఫ్ దేశాలపై దాడి చేసినట్లు తెలుస్తోంది.
News April 8, 2026
ట్రంప్‌ను ఇరాన్ ఫూల్ చేసిందా?

సీజ్‌ఫైర్‌పై ఇరాన్ ప్రతిపాదించిన పది పాయింట్ల డాక్యుమెంట్ పార్సీ, ఇంగ్లిష్ వెర్షన్‌లలో తేడాలు ఉండటం చర్చనీయాంశమైంది. పార్సీ వెర్షన్‌లో యురేనియంపై హక్కును గుర్తించాలనే డిమాండ్ ఉండగా ఇంగ్లిష్ వెర్షన్‌లో అది మిస్ అయినట్లు అసోసియేటెడ్ ప్రెస్ వెల్లడించింది. దీంతో ట్రంప్‌ను ఇరాన్ బురిడి కొట్టించిందనే టాక్ నడుస్తోంది. కాగా అణ్వాయుధాల తయారీకి యురేనియం ఎంతో కీలకం.


