News July 6, 2024
గ్రామంలో ‘పంచాయితీ’ తీర్చిన గేదె
ఇద్దరు వ్యక్తుల పంచాయితీని గేదె సులువుగా తీర్చేసిన ఘటన UPలోని ప్రతాప్‌గఢ్‌లో జరిగింది. నందలాల్‌కు చెందిన గేదె తప్పిపోగా, దాన్ని హనుమాన్ అనే వ్యక్తి తన ఇంట్లో కట్టేసి తిరిగిచ్చేందుకు నిరాకరించాడు. ఈ వివాదంపై పోలీసులు పంచాయితీ చేసినా ఫలితం దక్కలేదు. దీంతో ఇరువురూ రోడ్డుకు చెరో వైపు వెళ్లాలని, గేదె ఎవరిని అనుసరిస్తే వారికే సొంతమని SHO చెప్పారు. అది యజమాని నందలాల్‌కు వైపే వెళ్లడంతో కేసు క్లోజైంది.
Similar News
News January 16, 2025
యజమాని ఇష్టాన్ని బట్టే టెనంట్ నడుచుకోవాలి: హైకోర్టు
అద్దెకుండేవారు యజమాని ఇష్టాయిష్టాలను బట్టి నడుచుకోవాల్సి ఉంటుందని అలహాబాద్ హైకోర్టు తెలిపింది. అతడు/ఆమె కోరుకుంటే ప్రాపర్టీని ఖాళీ చేయాల్సిందేనని ఆదేశించింది. టెనంట్స్‌కు వ్యతిరేకంగా తీర్పునిచ్చేముందు యజమాని అవసరాన్ని కోర్టులు నిజనిర్ధారణ చేయాలని సూచించింది. UPలో తనకు అవసరముందని యజమాని చెప్పినా ప్రాపర్టీ ఖాళీ చేయకుండా టెనంట్స్ కోర్టుకెక్కడంతో ధర్మాసనం ఇలా స్పందించింది.
News January 16, 2025
‘సంక్రాంతికి వస్తున్నాం’: రెండ్రోజుల్లో రూ.77 కోట్లు
విక్టరీ వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా కలెక్షన్లలో దూసుకెళ్తోంది. రెండు రోజుల్లోనే రూ.77 కోట్లు(గ్రాస్) వసూలు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈరోజు కూడా బుక్ మై షోలో వేలల్లో టికెట్స్ బుక్ అవడంతో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉందని సినీవర్గాలు పేర్కొన్నాయి. మూవీలో వెంకీ కుటుంబం చేసిన కామెడీ ఫ్యామిలీ ఆడియన్స్‌ను తెగ మెప్పిస్తోంది.
News January 16, 2025
నథింగ్ డేను జరుపుకుంటున్నారా?
ఒక్కో రోజుకు ఒక్కో స్పెషాల్టీ. ఈరోజు కూడా ఓ స్పెషల్ ఉంది. నేడు అమెరికాలో నేషనల్ నథింగ్ డే. అక్కడి ప్రజలు తమ బిజీ షెడ్యూల్ నుంచి విరామం తీసుకుని, విశ్రాంతి పొందేందుకు ఒక రోజు అవసరమని కాలమిస్ట్ హెరాల్డ్ పుల్‌మన్ కాఫిన్ విశ్వసించారు. అందుకే ఈరోజు పనులన్నీ పక్కన పెట్టాలంటారు. ప్రజలు తమకిష్టమైన వారిని, స్నేహితులను ఆలింగనం చేసుకొని విష్ చేసుకోవాలని సూచిస్తుంటారు. 1973 నుంచి దీనిని జరుపుకుంటున్నారు.