News July 6, 2024
HYDలో బిర్యానీయే కాదు.. ఫార్మా కూడా ఫేమస్: మంత్రులు

HYD హైటెక్స్ ప్రాంగణంలో 73వ ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్ ఎక్స్‌పోకు ముఖ్యఅతిథిగా డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి కోమటిరెడ్డి హాజరయ్యారు. రోల్ ఆఫ్ ఇండియన్ ఫార్మా ఫర్ గ్లోబల్ వెల్‌బీయింగ్ నేపథ్యంతో 3 రోజుల పాటు సదస్సు జరగనుండగా, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫార్మా శాస్త్రవేత్తలు, ఫార్మసిస్టులు, విద్యార్థులు పాల్గొంటున్నారు. HYDలో బిర్యానీయే కాదు.. ఫార్మా కూడా ఫేమస్ అని మంత్రులు అన్నారు.
Similar News
News March 9, 2026
రంగారెడ్డి జిల్లాలో రైతు రిజిస్ట్రేషన్ 88% పూర్తి

రంగారెడ్డి జిల్లా పరిధిలో రైతుల రిజిస్ట్రేషన్ ప్రక్రియపై అధికారులు ఫోకస్ చేశారు. జిల్లాలో మొత్తం 1,97,029 మంది రైతులు ఉండగా ఇప్పటివరకు 88% రిజిస్ట్రేషన్ మాత్రమే పూర్తైనట్లుగా అధికారులు తెలిపారు. పీఎం కిసాన్ లాంటి పథకాలు అందాలంటే రైతుల రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతులందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
News March 9, 2026
రంగారెడ్డి: జిల్లాలో తొలిరోజు 139 మందికి వ్యాక్సిన్

హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. తొలి రోజులో భాగంగా రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 139 మంది బాలికలకు వ్యాక్సిన్ వేశారు. కొండాపూర్ జిల్లా ఆస్పత్రిలో 19 మంది, వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో 10, రాజేంద్రనగర్‌లో 30, హయత్‌నగర్‌లో 10, శంషాబాద్‌లో 20, చేవెళ్లలో 22, షాద్‌నగర్‌లో 17, మహేశ్వరంలో ఏడుగురు బాలికలకు వ్యాక్సిన్ వేశారు.
News March 9, 2026
నగరంలో పెరుగుతున్న భగభగలు

నగరంలో వారం రోజులుగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుతున్నాయి. సాధారణంగా ఏప్రిల్ మధ్యలో కనిపించే వేడి, మార్చి మొదటి వారంలోనే సెగలు పుట్టిస్తోంది. ఆదివారం నాటికి గరిష్ఠ ఉష్ణోగ్రతలు 34 నుంచి 37 డిగ్రీల మధ్య నమోదు కాగా.. రానున్న వారం రోజుల్లో 40 డిగ్రీల మార్కును దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది.


